ఒకప్పుడు ప్రయాణం అంటే ఏడాదికి ఒకసారి వచ్చే సమ్మర్ హాలిడేస్ ముచ్చట. కానీ ఇప్పటి ‘జెన్ జీ’ (Gen Z) జనరేషన్ ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. ఆఫీస్‌లో ప్రమోషన్ వచ్చినా, కాస్త వర్క్ స్ట్రెస్ పెరిగినా వెంటనే బ్యాగ్ సర్దేస్తున్నారు. లాంగ్ వీకెండ్ దొరికితే చాలు, ఎక్కడికైనా చెక్కేస్తున్నారు. ఈ తరం యువత లాంగ్ టూర్ల కంటే చిన్న చిన్న షార్ట్ ట్రిప్స్‌కే ఎందుకు జై కొడుతున్నారో వారి లేటెస్ట్ ట్రావెల్ ట్రెండ్స్ ఏంటో తెలుసుకుందాం.
ఏడాదికి ఒకసారి కాదు.. అప్పుడప్పుడు వెళ్లడమే క్రేజ్: పాత కాలం లాగా ఏడాది మొత్తం వెయిట్ చేసి ఒకే ఒక్క పెద్ద ట్రిప్ వేయడం ఈ తరం యువతకు అస్సలు నచ్చడం లేదు. ఇక రీసెంట్ సర్వేల ప్రకారం… 70 శాతం మంది జెన్ జీ యువత ఒక పెద్ద టూర్ కంటే ఏడాదిలో మూడు నాలుగు చిన్న చిన్న షార్ట్ ట్రిప్స్ (మైక్రో-కేషన్స్) వెళ్లడానికే ఇష్టపడుతున్నారు. ఇక కేవలం 24 నుండి 72 గంటల పాటు జరిగే ఈ మినీ జర్నీలు వారి లైఫ్‌స్టైల్‌లో ఒక భాగమైపోయాయి.
ప్లేస్ ముఖ్యం కాదు.. ఫీలింగ్ ముఖ్యం: జెన్ జీ వాళ్లు ఏ ఊరు వెళ్తున్నాం అనేదాని కంటే.. ఎందుకు వెళ్తున్నాం అనే ‘పర్పస్’ (ఉద్దేశం) కే ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. దీనినే ‘వై-కేషన్’ (Why-cation) అంటున్నారు. ఆఫీస్ ఒత్తిడి నుంచి రిలాక్స్ అవ్వడానికో కొత్త రకం ఫుడ్ టేస్ట్ చేయడానికో లేదా ప్రకృతి మధ్య కాసేపు ప్రశాంతంగా గడపడానికో వీరు ప్రయాణాలు ప్లాన్ చేస్తున్నారు.ఇక 43 శాతం మంది కేవలం స్ట్రెస్ నుంచి రిలీఫ్ కోసమే ట్రిప్స్ వేస్తున్నారట.

నో ప్లాన్స్.. నో లిస్ట్.. అంతా డిఫరెంట్: ఇంతకుముందులాగా పొద్దున్నే లేచి చూడాల్సిన పర్యాటక ప్రాంతాల లిస్ట్ (ఇటినెరరీ) వీళ్ల దగ్గర ఉండదు. సోషల్ మీడియాలో వైరల్ అయిన రద్దీ ప్రదేశాలకు వెళ్లడానికి వీరు అస్సలు ఇష్టపడరు. ఇక ఎవరికీ తెలియని ప్రశాంతమైన కొత్త ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్తుంటారు. 95 శాతం మంది యువత తమ ట్రిప్స్ చాలా పర్సనల్‌గా ఎవరి ఒత్తిడి లేకుండా ఫ్రీగా సాగాలని కోరుకుంటున్నారు.
మొత్తానికి జెన్ జీ ట్రావెల్ స్టైల్ చూస్తుంటే.. ప్రయాణం అనేది కేవలం ఒక విలాసం కాదు, అదొక లైఫ్ స్టైల్ అనిపిస్తోంది. జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి రీఛార్జ్ అవ్వడానికి ఈ షార్ట్ ట్రిప్స్ వారికి బాగా హెల్ప్ అవుతున్నాయి.
గమనిక: ప్రయాణాలు మనసుకు రిలాక్సేషన్ ఇస్తాయి కాబట్టి, బిజీ లైఫ్ నుండి కాస్త బ్రేక్ తీసుకుని ఇలాంటి చిన్న ట్రిప్స్ ప్లాన్ చేసుకోవడం మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిది.
The post షార్ట్ ట్రిప్స్‌కే ప్రాధాన్యం… జెన్ జీ ట్రావెల్ హ్యాబిట్స్ షిఫ్ట్! appeared first on Manalokam – Latest Telugu News & Updates.