
ఎటా: ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటన కలకలం రేపింది. పెళ్లయిన రెండు నెలలకే భార్య ఓయో రూంలో తన ప్రియుడితో కనిపించడంతో భర్త గుండె బద్ధలయింది. ఎటాలోని కొత్వాలి దేహత్ ప్రాంతంలోని కాస్‌గంజ్ రోడ్డులో ఉన్న ఒక ఓయో హోటల్‌లో, భార్య తన ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
In #Etah , Uttar Pradesh, a husband caught his wife red-handed with her alleged lover inside an OYO hotel room on Kasganj Road, just two months after their marriage.
Having developed suspicions, the husband tracked his wife to the hotel room where she was staying with her… pic.twitter.com/trf8VE6tGx
— ForMenIndia (@ForMenIndia_) July 4, 2026
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. భర్త ఫిర్యాదుతో.. విచారణ నిమిత్తం భార్యను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది.
పక్కా సమాచారంతో ఓయో హోటల్‌కు వెళ్లిన భర్త.. తన భార్యను ఒక గదిలో మరో వ్యక్తితో చూసి విస్తుపోయాడు. తమకు కేవలం రెండు నెలల క్రితమే వివాహం జరిగిందని భర్త తెలిపాడు. ఈ ఘటన గురించి వెంటనే డయల్ 112 పోలీసులకు సమాచారం అందించారు. డయల్ 112 ఇన్‌చార్జ్ ధర్మేంద్ర పవార్ పోలీసులతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ALSO READ :పాయసంలో నిద్రమాత్రలు కలిపి భర్తను చంపిన భార్య…
పోలీసులు ఆ మహిళను, ఆమె ప్రియుడిని హోటల్ నుంచి గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. ఆ వివాహిత ప్రియుడు పోలీస్ శాఖలో ఉద్యోగిగా ఉన్నట్లు తెలిసింది. ఫిర్యాదు ఆధారంగా ఇద్దరినీ విచారిస్తున్నట్లు.. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ధర్మేంద్ర పవార్, లిప్టన్ అవుట్‌పోస్ట్ ఇన్‌చార్జ్ అభిషేక్ వస్తల్ తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.