
FIFA World Cup 2026 Round of 16: ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026)లో ఉత్కంఠభరితమైన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లు ముగిశాయి. ఇప్పుడు అందరి దృష్టి రౌండ్ ఆఫ్ 16 పైకి మళ్లింది. ప్రపంచకప్ ట్రోఫీ రేసులో ప్రస్తుతం 16 జట్లు మిగిలి ఉన్నాయి. ఈ రౌండ్ ఆఫ్ 32లో నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన బలమైన జర్మనీని పరాగ్వే ఓడించడం, అలాగే నెదర్లాండ్స్‌పై మొరాకో పెనాల్టీ షూటౌట్‌లో విజయం సాధించడం ఈ టోర్నీలోనే హైలెట్ గా నిలిచాయి. ఇకపై ట్రోఫీని ముద్దాడటానికి జట్లు కేవలం నాలుగు విజయాల దూరంలో మాత్రమే ఉన్నాయి.
రౌండ్ ఆఫ్ 16లో లీగ్ హైలైట్స్:
* కెనడా వర్సెస్ మొరాకో: జూలై 4న జరిగే ఈ మ్యాచ్‌తోనే రౌండ్ ఆఫ్ 16 పోరు ప్రారంభం కానుంది.
* పోర్చుగల్ వర్సెస్ స్పెయిన్: జూలై 7న జరగబోయే ఈ మ్యాచ్ కోసం ఫుట్‌బాల్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. పోర్చుగల్ ఇప్పటివరకు ఒక్క ప్రపంచకప్ కూడా గెలవలేదు. క్రిస్టియానో రొనాల్డోకు ఇది చివరి ప్రపంచకప్ అయ్యే అవకాశం ఉండటంతో, ఈ లెజెండ్ కోసం కప్పు గెలవాలని పోర్చుగల్ కసితో ఉంది. అయితే, ప్రస్తుత ఫామ్ ప్రకారం స్పెయిన్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
* అర్జెంటీనా వర్సెస్ ఈజిప్ట్: డిఫెండింగ్ ఛాంపియన్ అయిన అర్జెంటీనా ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఓటమి లేకుండా దూసుకుపోతోంది. రౌండ్ ఆఫ్ 32లో కేప్ వెర్డే జట్టు అర్జెంటీనాకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, ఎలాగోలా బతికి బయటపడింది. ఇప్పుడు వారు మహ్మద్ సలాకు చెందిన ఈజిప్ట్ జట్టుతో తలపడనున్నారు.
* ఇంగ్లాండ్ వర్సెస్ మెక్సికో: డీఆర్ కాంగోను ఓడించి ఇంగ్లాండ్, ఈక్వెడార్‌పై గెలిచి మెక్సికో ఈ రౌండ్‌కు క్వాలిఫై అయ్యాయి. 1966 తర్వాత రెండోసారి ప్రపంచకప్ గెలవాలని ఇంగ్లాండ్ చూస్తుండగా, మెక్సికో తన క్వార్టర్ ఫైనల్ రికార్డును (1970, 1986) తిరగరాయాలని భావిస్తోంది.
* ఇతర మ్యాచ్‌లు: ఫ్రాన్స్ జట్టు పరాగ్వేతో, బ్రెజిల్ జట్టు ఎర్లింగ్ హాలాండ్‌కు చెందిన నార్వే జట్టుతో తలపడనున్నాయి.
రౌండ్ ఆఫ్ 16 పూర్తి షెడ్యూల్ (భారత కాలమానం ప్రకారం):
* జూలై 4 (శనివారం): కెనడా వర్సెస్ మొరాకో– రాత్రి 10:30 గంటలకు
* జూలై 5 (ఆదివారం): పరాగ్వే వర్సెస్ ఫ్రాన్స్– తెల్లవారుజామున 2:30 గంటలకు
* జూలై 6 (సోమవారం): బ్రెజిల్ వర్సెస్ నార్వే– తెల్లవారుజామున 1:30 గంటలకు
* జూలై 6 (సోమవారం): మెక్సికో వర్సెస్ ఇంగ్లాండ్– తెల్లవారుజామున 5:30 గంటలకు
* జూలై 7 (మంగళవారం): పోర్చుగల్ వర్సెస్ స్పెయిన్– అర్ధరాత్రి 12:30 గంటలకు
* జూలై 7 (మంగళవారం): యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ బెల్జియం– తెల్లవారుజామున 5:30 గంటలకు
* జూలై 7 (మంగళవారం): అర్జెంటీనా వర్సెస్ ఈజిప్ట్– రాత్రి 9:30 గంటలకు
* జూలై 8 (బుధవారం): కొలంబియా vs స్విట్జర్లాండ్– తెల్లవారుజామున 1:30 గంటలకు
రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించిన జట్లు ఇవే:
* కెనడా
* మొరాకో
* పరాగ్వే
* ఫ్రాన్స్
* బ్రెజిల్
* నార్వే
* మెక్సికో
* ఇంగ్లాండ్
* పోర్చుగల్
* స్పెయిన్
* అర్జెంటీనా
* ఈజిప్ట్
* కొలంబియా
* యునైటెడ్ స్టేట్స్ (USA)
* బెల్జియం
* స్విట్జర్లాండ్.