Reading Time: < 1 minute
Hyderabad Rain: అర్ధరాత్రి నుంచి నగరంలో జడివాన.. చిరుజల్లులకు పులకరింత!

హైదరాబాద్‌, మే 27: హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా పలు చోట్ల మంగళవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం దంచికొడుతుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం నగరంలో కురుస్తోంది. కుత్బుల్లాపూర్‌, మియాపూర్‌, చందానగర్‌, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్‌, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో భరీగా వర్షం పడుతోంది. దీంతో రోడ్లన్ని జలమయ్యాయి. రోడ్లపై వాహనాల రద్దీ పెద్దగా లేకపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కలగలేదు.

మరోవైపు వర్షానికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రోహిణీ కార్తి ప్రభావంతో గత రెండు రోజులుగా నిప్పుల కుంపటిలా ఉన్న నగరం తాజా జల్లులతో చల్లబడింది. ఎండలకు తల్లడిల్లిపోయిన ప్రజలకు కాస్త ఉపశమనం లభించినట్లైంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాల్లోనూ వర్షం దంచికొడుతుంది. ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుండడంతో సంగారెడ్డిలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రైతులు ఆరు బయట ఆరబెట్టిన ధాన్యం తడిచిపోయింది. ఉమ్మడి జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లోనూ వర్షానికి ధాన్యం తడిచిపోయింది. నగరంతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాలలో అర్థరాత్రి భారీగా వర్షం కురిసింది. సంగారెడ్డి, కరీంనగర్, రంగారెడ్డి, సిద్దిపేట తదితర జిల్లాలలో భారీగా జల్లులు కురిశాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.