
హిందూ సంప్రదాయంలో ప్రతి రోజుకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇక అమావాస్య.. సోమవారం రెండూ వచ్చాయంటే.. ఆరోజు విశిష్టత.. ప్రాముఖ్యత అంతా ఇంతాకాదు. అలాంటి ప్రత్యేక మైన రోజు ఈ ఏడాది ( 2026) జూన్ 15న వచ్చింది. ఆ రోజు ఆడవారు తప్పని కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. మహిళలు ఎట్టి పరిస్థితిలో కొన్ని పనులు చేయకూడని పురాణాల ద్వారా తెలుస్తుంది. సోమాపతి అమావాస్య ( జూన్ 15)రోజున ఎలాంటివి చేయాలి.. ఎలాంటివి చేయకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .
సోమవారం .. పరమేశ్వరుడికి చాలా ఇష్టమైన రోజు. ఆరోజు శివాలయంలో ప్రత్యేకంగా పూజలు చేస్తారు. కొంతమంది మహిళలు ఆ రోజు ఉపవాస దీక్షను కూడా పాటిస్తారు. అమావాస్య.. సోమవారం రెండు కలిసి వస్తే ఆ రోజు ( జూన్ 15) శివుడికి అభిషేకం చేసి.. బిల్వ పత్రాలతో పూజ చేస్తే దీర్ఘకాలంగా ఎదుర్కొన్న సమస్యలు అన్ని విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
పెళ్లి అయిన మహిళలు సోమాపతి అమావాస్య రోజున చేయకూడని పనులు
- అమావాస్య రోజు తెల్లవారుజామునే లేచి కాలకృత్యాల అనంతరం.. సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. ఆ తరువాత నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. శివాలయానికి వెళ్లి స్వామిని దర్శించుకోవాలి. ఆరోజు ఉపవాస దీక్షను పాటించాలి. ఎవరిని కించపరచి మాట్లాడకూడదు. అవకాశం ఉంటే మౌనవ్రతం చేయడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.
- సోమాపతి అమావాస్య రోజున స్త్రీలు ఇంద్రియ నిగ్రహం పాటించాలి.
- దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి.
- ఆరోగ్యకారణాలతో ఉపవాసం ఉండలేనివారు ఎట్టి పరిస్థితిలో మాంసాహారం తినకూడదు.
- మద్యం త్రాగకూడదు.. సిగరెట్ .. జరదా వంటి వాటికి దూరంగా ఉండలి
- గోర్లు కత్తిరించుకోకూడదు.. తల దువ్వుకోకుండా అల్లుకోవాలి.
- అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు.
- అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవడం కూడా దరిద్ర హేతువుగా పరిగణిస్తారు. కనుక ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం మంచిదని పండితులు చెబుతున్నారు.
- ఈ నియమాలన్నీ పాటించినట్లయితే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. పెళ్లైన మహిళలు తప్పకుండా ఈ నియమాలను ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. లేదంటే భర్తకు కీడు జరుగుతుందని పురాణాల్లో చెప్పబడింది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.