
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు ఇంధన ఖర్చును తగ్గించుకునే మార్గాల కోసం చూస్తున్నారు. అలాంటి వారికి గూగుల్ మ్యాప్స్ ‘ఫ్యుయెల్ ఎఫిషియెంట్ రూట్స్’ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌ను ఆన్ చేస్తే ట్రాఫిక్ రద్దీ, సిగ్నల్స్ సంఖ్య, రహదారి పరిస్థితులు, ఎత్తుపల్లాలు వంటి అంశాలను విశ్లేషించి ఫ్యుయెల్ ఎక్కువ ఖర్చు కాకుండా ఉండే రూట్‌ని సూచిస్తుంది. దీంతో అనవసరంగా ట్రాఫిక్‌లో ఎక్కువసేపు నిలిచిపోవడం తగ్గి, పెట్రోల్ లేదా డీజిల్ ఖర్చులో కొంత మేర ఆదా అయినట్టే.
►ALSO READ | జ్యోతిష్యం:జూన్15 శక్తివంతమైన అమావాస్య.. ఆడవారు ఈ పనులు అస్సలు చేయొద్దు..!
ముఖ్యంగా ప్రతిరోజూ ఉద్యోగం, వ్యాపారం లేదా ఇతర పనుల కోసం ఎక్కువ దూరం ప్రయాణించేవారికి ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని వాడాలంటే గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేసి, ప్రొఫైల్ ఫొటోపై నొక్కి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అక్కడ నావిగేషన్‌ను సెలక్ట్ చేసి, రూట్ ఆప్షన్స్ విభాగంలో ఉన్న ప్రిఫర్ ఫ్యుయెల్ ఎఫిషియెంట్ రూట్స్ అనే ఆప్షన్ని ఆన్ చేయాలి. తర్వాత వెహికల్ పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్.. ఏదైతే అది సెలక్ట్ చేసి, గూగుల్ మ్యాప్స్ దానికి అనుగుణంగా ఫ్యుయెల్‌ని సేవ్ చేసే రూట్లను సూచిస్తుంది.