Reading Time: < 1 minute
Ram Charan Srikanth Odela Movie Crazy Mass Combo Updates

Ram Charan: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తాజాగా పెద్ది సినిమాతో సూపర్ సక్సెస్‌ను అందుకున్నారు. ప్రస్తుతం మెగాపవర్ స్టార్ తన సినిమాల లైన్అప్‌ను నెక్ట్స్ లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న చరణ్, తాజాగా టాలీవుడ్ మాస్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చేతులు కలిపారనే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నానితో ‘దసరా’ వంటి రా అండ్ రస్టిక్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల.. ఇప్పుడు రామ్ చరణ్ కోసం అంతకుమించిన ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సెన్సెషనల్ డైరెక్టర్ నానితో ‘ది ప్యారడైజ్’ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత ఆయన మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత మెగా పవర్ స్టార్‌తో తన నెక్ట్స్ సినిమాను ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ‘రంగస్థలం’ సినిమాలో చిట్టిబాబుగా రామ్ చరణ్ చేసిన మాస్ పర్ఫార్మెన్స్ థియేటర్లలో ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తాజాగా పెద్ది సినిమాలో చరణ్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలకు మించి ఊరమాస్ లుక్‌ అండ్ క్యారెక్టరైజేషన్‌ను శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల టాక్. శ్రీకాంత్ మార్క్ రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎలిమెంట్స్.. రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్‌డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. చరణ్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.