
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో విషాదం చోటు చేసుకుంది. ఫ్రెండ్స్ తో కలిసి ఫామ్ హౌస్ లో గెట్ టు గెదర్ పార్టీకి వెళ్లిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శనివారం ( జూన్ 13 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. చోటుప్పుల్ మండలం కొయ్యలగూడెం గ్రామ శివారులోని ఓ ఫామ్ హౌస్ జరిగింది ఈ ఘటన.
ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తిని మంచిర్యాల జిల్లా గాండ్ల రాము గా గుర్తించారు పోలీసులు. వీకెండ్ కావడంతో 20 మంది సాఫ్ట్ వేర్ ఫ్రెండ్స్ తో కలిసి ఫామ్ హౌస్ కి వెళ్లాడు రాము. ఏం జరిగిందో ఏమో కానీ.. రాము అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాము ఒంటి మీద ఎవరో కొట్టినట్లు గాయాలు ఉండటం, ఫామ్ హౌస్ లో సీసీటీవీ కెమెరాలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పార్టీలో పాల్గొన్న అందరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. రాము మృతికి పార్టీలో గొడవేమైనా కారణమా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.