Reading Time: < 1 minute
Police Complaint Director Sanjeev Megoti Varalaxmi Controversy

వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించిన హారర్-యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ క్రమంలో

దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ, “మా చిత్ర హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ నాలెడ్జ్ కంటే మా నాలెడ్జ్ ల‌క్ష రెట్లు ఎక్కువ ఉంది. అందుకే ప్ర‌స‌న్న కుమార్ వంటి పెద్ద‌ల సూచ‌న మేర‌కే ఆమెకు సారీ చెప్ప‌డం జ‌రిగింది. అంతేకానీ, స‌మ‌స్య పూర్తి స‌ర్దుమ‌ణిగింద‌ని కూడా చెప్ప‌లేను. మొత్తానికి ఒక వివాదంతో స‌త‌మ‌తం అయ్యాం.. చివ‌రికి విజ‌యంతో శుభం కార్డు ప‌డింద‌ని భావిస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో విడుదలైన ‘పోలీస్ కంప్లైంట్’కు అద్భుతమైన స్పందన వస్తోంది. విడుద‌లైన రెండ‌వ రోజు నుంచే థియేట‌ర్‌లు పెరుగుతున్నాయి. దర్శకుడిగా, రచయితగా, సంగీత దర్శకుడిగా ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం” అని అన్నారు.

ఈ సందర్భంగా నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, ఈ సినిమా హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్ సినిమా ప్ర‌మోష‌న్‌లో పాల్గొన‌లేద‌ని యూనిట్ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆమె ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ ను సంప్ర‌దించారు. ఈ వివాదాన్ని పెద్దల జోక్యంతో సానుకూలంగా పరిష్కరించుకోమని చెప్పాను. దీంతో దర్శకుడు సంజీవ్ మేగోటి త‌న త‌ప్పు లేక‌పోయినా వ‌ర‌లక్ష్మికి సారీ చెప్పారు. ఆయ‌న‌ ప్రదర్శించిన వినయం, సహనమే ఈ విజయానికి మరో కారణమని పేర్కొన్నారు.