Reading Time: < 1 minute

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌తో ముగిసిన నిర్మాతల భేటీ.. ఎగ్జిబిటర్ల సమస్యలు తీరేనా

Caption of Image.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్తో  నిర్మాతల భేటీ  ముగిసింది. 2026 మే 26న రాజమండ్రిలో పవన్ ను కలిసిన నిర్మాతలు.. సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితులపై  చర్చించారు. సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు తెలిపారు. సుదీర్ఘంగా విన్న పవన్‌ కళ్యాణ్‌. త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కారం వచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ విషయంలో నిర్మాతలు కంగారు పడొద్దని పవన్‌ భరోసా ఇచ్చారు.

పెద్ది సినిమాకు 5 షోలకు అనుమతి ఉందని సమావేశం అనంతరం నిర్మాతలు తెలిపారు. ఈ భేటీలో కేవలం పెద్ది సినిమా గురించే కాకుండా అనేక విషయాలు చర్చలోకి వచ్చాయని తెలిపారు. ప్రొడ్యూసర్స్-ఎగ్జిబిటర్స్ వివాదాలు త్వరలోనే పరిష్కారం అవుతాయని పవన్ చెప్పారని అన్నారు. 

సింగిల్ స్క్రీన్ విషయంలో ఇప్పటికే ఒప్పందం ఉందని నిర్మాతలు వెల్లడించారు. పెద్ది విడుదలకు ఎలాంటి ఆటంకం లేదని క్లారిటీ ఇచ్చారు. సినీ ఇండస్ట్రీకి అండగా ఉంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు నిర్మాతలు చెప్పారు. 
 

©️ VIL Media Pvt Ltd.