Reading Time: < 1 minute

గేటు మీద పడి చిన్నారి మృతి.. నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లా దేవుని తిరుమలాపూర్‌‌‌‌లో విషాదం

Caption of Image.

పెద్దకొత్తపల్లి, వెలుగు: ఇంటి ప్రహరీ గేటు గాలికి ఎగిరి మీద పడడంతో ఓ చిన్నారి చనిపోయింది. ఈ ఘటన నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిరుమలాపూర్‌‌‌‌ గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి బుల్లి భాగ్యలక్ష్మి, శివకుమార్‌‌‌‌ దంపతులకు ఇద్దరు పిల్లలు. 

ఇందులో లిప్పిక శ్రేయ (5) రెండో కూతురు. శనివారం రాత్రి శ్రేయ ఇంటి గేటు వద్ద ఉన్న సమయంలో ఈదురుగాలులు వీయడంతో గేటు ఒక్కసారిగా ఎగిరి శ్రేయ మీద పడింది. దీంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది. గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారిని హాస్పిటల్‌‌‌‌కు తరలిస్తుండగా… మార్గమధ్యలో చనిపోయింది.

©️ VIL Media Pvt Ltd.