Reading Time: 2 minutes

ఇప్పుడున్న రోజుల్లో ఆధార్ కార్డ్ అనేది మనకు ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే దీని ఇక భద్రత కోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. మనం ఇన్నాళ్లూ వాడుతున్న పాత ‘mAadhaar’ యాప్‌ను పూర్తిగా క్లోజ్ చేసి, దాని స్థానంలో సరికొత్త ‘ఆధార్’ యాప్‌ను లాంచ్ చేసింది.

పాత యాప్ బంద్.. కొత్త యాప్ రెడీ: మీ ఫోన్‌లో ఇంకా పాత mAadhaar యాప్ ఉంటే అది ఇకపై పనిచేయదు. UIDAI సూచనల ప్రకారం.. వినియోగదారులు వెంటనే ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి ఈ కొత్త యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇక మీ పాత డేటా మొత్తాన్ని ఈ కొత్త యాప్‌లోకి సులభంగా బదిలీ (ట్రాన్స్‌ఫర్) చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. ఇందులో సెక్యూరిటీ పరంగా చాలా మార్పులు చేశారు.

Big Update for Data Safety!.. Secret Features in Aadhaar App Revealed!
Big Update for Data Safety!.. Secret Features in Aadhaar App Revealed!

క్యూఆర్ (QR) కోడ్ సీక్రెట్ ఫీచర్: ఈ కొత్త యాప్‌లో వచ్చిన మోస్ట్ పవర్‌ఫుల్ ఫీచర్ ఏంటంటే.. క్యూఆర్ కోడ్ షేరింగ్. సాధారణంగా మనం ఎవరికైనా ఐడీ ప్రూఫ్ ఇవ్వాలంటే పూర్తి ఆధార్ నంబర్ కనిపిస్తుంది.ఇక  కానీ ఈ కొత్త ఫీచర్ ద్వారా మీ పూర్తి నంబర్‌ను ఎవరికీ చూపించకుండానే, కేవలం ఒక క్యూఆర్ కోడ్ ద్వారా మీ ఐడీని సురక్షితంగా వెరిఫై చేసుకోవచ్చు. దీనివల్ల మీ ఆధార్ నంబర్ దుర్వినియోగం అయ్యే ఛాన్స్ అస్సలు ఉండదు.

యాప్‌లోనే అప్‌డేట్స్: ఈ కొత్త యాప్ కేవలం ఆధార్ కార్డును దాచుకోవడానికే కాదు, హోమ్ సర్వీస్‌లా కూడా పనిచేస్తుంది. ఇక మీ ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ మార్చాలన్నా లేదా అడ్రస్ (చిరునామా) అప్‌డేట్ చేయాలన్నా.. ఇకపై ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. నేరుగా ఈ యాప్ ద్వారానే చాలా సులువుగా మీ వివరాలను మార్చుకునే సదుపాయాన్ని UIDAI కల్పించింది.

డిజిటల్ యుగంలో ఆధార్ డేటా చోరీకి గురికాకుండా ఉండేందుకు UIDAI తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందించదగ్గది. ఇక మీ ప్రైవసీకి భంగం కలగకుండా ఉండాలంటే వెంటనే పాత యాప్‌ను డిలీట్ చేసి, సరికొత్త అప్‌డేటెడ్ ఆధార్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.

గమనిక: ఈ కొత్త ఆధార్ యాప్‌ను కేవలం గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ వంటి అధికారిక ప్లాట్‌ఫారమ్‌ల నుండి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోండి. ఎలాంటి ఫేక్ యాప్స్ లింకులపై క్లిక్ చేయవద్దు

The post డేటా సేఫ్టీకి బిగ్ అప్‌డేట్!.. ఆధార్ యాప్‌లో సీక్రెట్ ఫీచర్లు బయటపడ్డాయి! appeared first on Manalokam – Latest Telugu News & Updates.