Reading Time: 2 minutes

మన తెలుగు రాష్ట్రాల్లో ముద్ద అన్నం పడనిదే రోజు గడవదు. రోజుకు మూడు పూటలా అన్నం తిన్నా బోర్ కొట్టని వాళ్ళు ఎందరో ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది వైట్ రైస్ పక్కన పెట్టి బ్రౌన్ రైస్ వైపు మొగ్గు చూపుతున్నారు. వైట్ రైస్ తింటే లావు అవుతామనే భయం, షుగర్ వస్తుందనే టెన్షన్ దీనికి కారణం. అసలు ఈ రెండింటిలో ఏది బెస్ట్, ఎవరికి ఏది మంచిదో ఇక్కడ సింపుల్‌గా తెలుసుకుందాం.

ఫైబర్ పవర్‌హౌస్ బ్రౌన్ రైస్: బ్రౌన్ రైస్ పాలిష్ చేయని బియ్యం. దీనిపై ఉండే ఊక పొర అలాగే ఉంటుంది. అందుకే ఇందులో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇక ఇది తింటే జీర్ణక్రియ బాగుంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి, హెల్తీగా ఉండాలనుకునే వారికి ఇది ఒక సూపర్ ఆప్షన్ అని చెప్పాలి.

షుగర్ కంట్రోల్ కి బెస్ట్: మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారికి బ్రౌన్ రైస్ ఒక వరం లాంటిది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అంటే ఇక ఇది తిన్నప్పుడు రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోవు. మెల్లగా అరుగుతూ శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది.

Brown Rice Revolution: The Healthy Swap Replacing White Rice!
Brown Rice Revolution: The Healthy Swap Replacing White Rice!

యాంటీ ఆక్సిడెంట్స్ తో గుండెకు రక్షణ: బ్రౌన్ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్, మెగ్నీషియం, సెలీనియం ఎక్కువగా ఉంటాయి. ఇక ఇవి శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెను పదిలంగా ఉంచుతాయి. అలాగే క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఇవి మనల్ని కాపాడతాయి.

వైట్ రైస్ కూడా తక్కువేం కాదు: చాలా మంది వైట్ రైస్ ని తప్పుబడుతుంటారు కానీ, ఇందులోనూ మంచి ప్రయోజనాలు ఉన్నాయి. దీనిపై పొర తీసేయడం వల్ల ఇది చాలా సులభంగా జీర్ణమవుతుంది.ఇక  నీరసంగా ఉన్నప్పుడు లేదా జబ్బుపడి కోలుకుంటున్నప్పుడు వైట్ రైస్ తింటే త్వరగా శక్తి వస్తుంది. ఇందులో కొవ్వు కూడా చాలా తక్కువగా ఉంటుంది.

పోషకాల పరంగా చూస్తే బ్రౌన్ రైస్ ఎప్పుడూ ముందే ఉంటుంది. కానీ అలాగని వైట్ రైస్ పూర్తిగా మానేయాల్సిన పనిలేదు. మీకు జీర్ణ సమస్యలు ఉంటే వైట్ రైస్, బరువు మరియు షుగర్ కంట్రోల్ చేసుకోవాలంటే బ్రౌన్ రైస్ ఎంచుకోవడం మంచిది. మన లైఫ్ స్టైల్ కి ఏది సెట్ అవుతుందో చూసుకుని బ్యాలెన్స్‌డ్ గా తినడమే అసలైన ఆరోగ్యం.

గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి డైట్‌లో ఎలాంటి మార్పులు చేయాలన్నా ఒకసారి డాక్టర్ లేదా న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించడం మంచిది.

The post హెల్త్ గేమ్ ఛేంజర్!.. వైట్ రైస్‌ను రీప్లేస్ చేస్తున్న బ్రౌన్ రైస్! appeared first on Manalokam – Latest Telugu News & Updates.