Reading Time: 2 minutes

వేసవి కాలం రాగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది పుల్లటి పచ్చి మామిడికాయ. ఉప్పు, కారం దట్టించి తింటుంటే ఆ మజానే వేరు కదా! అయితే, పచ్చి మామిడికాయ కేవలం నోటికి రుచిని ఇవ్వడమే కాదు, అంతకు మించిన ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఇందులో దాగున్నాయి. తాజాగా నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఉత్తరప్రదేశ్ కూడా ఈ పుల్లటి మామిడి గొప్పతనాన్ని ప్రత్యేకంగా మెచ్చుకుంటూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. మరి దీనివల్ల కలిగే లాభాలేంటో సింపుల్‌గా చూసేద్దామా..

బాడీని హైడ్రేట్‌గా ఉంచే నేచురల్ డ్రింక్: ఎండలు మండిపోతున్నప్పుడు శరీరం త్వరగా అలసిపోతుంది, డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఇలాంటి టైంలో పచ్చి మామిడికాయను తినడం లేదా దానితో ‘ఆమ్ పన్నా’ (మామిడి జ్యూస్) చేసుకుని తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. ఇక ఇది ఎండదెబ్బ తగలకుండా కాపాడుతూ, మనల్ని రోజంతా తాజాగా ఉంచుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరిచే సూపర్ ఫుడ్: చాలామందికి ఎండాకాలంలో జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. పచ్చి మామిడికాయలో ఉండే కొన్ని ప్రత్యేక గుణాలు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను దూరం చేయడమే కాకుండా, మన పేగుల ఆరోగ్యాన్ని అద్భుతంగా కాపాడుతుంది.

Eating Raw Mangoes? Here Are the Amazing Health Benefits
Eating Raw Mangoes? Here Are the Amazing Health Benefits

కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టే సంజీవిని: మారిన మన జీవనశైలి వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోవడం కామన్‌గా మారింది. అయితే, పచ్చి మామిడికాయను క్రమం తప్పకుండా డైట్‌లో చేర్చుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్‌లోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇది పరోక్షంగా మన గుండెను కూడా పదిలంగా ఉంచుతుంది.

ఇమ్యూనిటీని పెంచే విటమిన్ సి: పచ్చి మామిడికాయలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది. అలాగే ఇక  ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు కాలేయం పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.

గమనిక: పచ్చి మామిడికాయను అమితంగా ఇష్టపడి విపరీతంగా తినేయకండి. అతిగా తింటే గొంతు నొప్పి లేదా కడుపునొప్పి వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే గర్భిణీలు, కడుపులో అల్సర్లు ఉన్నవారు కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవడం మంచిది.

The post రా మామిడి తింటున్నారా?.. ఈ బెనిఫిట్స్ తెలుసా! appeared first on Manalokam – Latest Telugu News & Updates.