Reading Time: 2 minutes

ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం పెద్ద సమస్యగా మారిపోయింది. జిమ్‌లు, డైట్స్, సప్లిమెంట్స్… ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం మాత్రం చాలా మందికి కనిపించడం లేదు. కానీ ఆశ్చర్యకరంగా, కొన్ని దేశాలు మాత్రం ఈ సమస్యను చాలా సింపుల్‌గా కంట్రోల్ చేస్తున్నాయి. వాళ్లు గంటల తరబడి జిమ్‌లో కష్టపడరు… కానీ ఫిట్‌గా, స్లిమ్‌గా ఉంటారు. అసలు వాళ్ల సీక్రెట్ ఏంటంటే.. వారి రోజువారీ జీవనశైలిలోనే దాగి ఉంది!

జపాన్ సీక్రెట్: “80% కడుపు చాలు: జపాన్ ప్రజలు ఫిట్‌గా ఉండటానికి ఫాలో అయ్యే గోల్డెన్ రూల్ — “హరా హచి బు”. అంటే కడుపు నిండే వరకు కాకుండా, 80% నిండిందన్న ఫీలింగ్ రాగానే తినడం ఆపేస్తారు. ఇది చిన్న అలవాటు అనిపించినా… దీని వల్ల ఓవర్ ఈటింగ్ తగ్గుతుంది, జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది. నడక ఎక్కువ నడుస్తారు. అలాగే సీ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు. ఇవి కూడా వాళ్ల ఫిట్‌నెస్‌కు పెద్ద కారణాలు.

వియత్నాం: తాజా ఆహారం తో నడకే జిమ్!: వియత్నాం ప్రపంచంలోనే తక్కువ ఊబకాయం ఉన్న దేశాల్లో ఒకటి. కారణం చాలా సింపుల్ ఇక్కడ నూనె తక్కువవాడతారు. ఇంకా తాజా కూరగాయలు, సూప్‌లు ఎక్కువ అంతేకాక  ప్యాకెట్ ఫుడ్‌కు నో అని బోర్డు పెడతారు. ఇక వాళ్లు ఎక్కువగా నడుస్తారు లేదా బైక్ వాడుతారు. అంటే వారికి తెలియకుండానే రోజూ వ్యాయామం జరుగుతుంది.

How Some Nations Are Reducing Obesity Successfully
How Some Nations Are Reducing Obesity Successfully

ఇథియోపియా: కష్టపడే జీవితం- ఫిట్ బాడీ: ఇథియోపియాలో ఊబకాయం తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం, వారి జీవన విధానం. ఇక్కడ అందరు ఎక్కువ శారీరక శ్రమ చేస్తారు.అంతేకాదు  జంక్ ఫుడ్‌కు దూరంగా వుంటారు. వాళ్ళు ఎక్కువ ఇంటి వంటకే ప్రాధాన్యత ఇస్తారు, ఇదే వారి సీక్రెట్.

ఈ  దేశాలలో కూల్ డ్రింక్స్ తక్కువ ఇక బయట ఫుడ్ తగ్గింపు అందరు ఇంటి వంట ఎక్కువ మక్కువ చూపుతారు. ఇదే అసలు గేమ్ ఛేంజర్

మనం నేర్చుకోవాల్సింది ఏమిటి?: ఇక్కడ మనం వాళ్లు చేస్తున్నది పాటించటానికి ట్రై చేయాలి. అది rocket science కాదు… చాలా సింపుల్ అని అర్ధం చేసుకోవటం. ఇక కడుపు నిండక ముందే తినటం ఆపేయాలి. ఇక ఎక్కువగా నడవటం. ఈ సూత్రం పాటించు అదే fresh food తిను junk తగ్గించు

ఇక చివరిగా ఊబకాయం తగ్గాలంటే పెద్ద పెద్ద డైట్స్ అవసరం లేదు… చిన్న చిన్న అలవాట్లే చాలన్న విషయాన్ని ఈ దేశాలు ప్రూవ్ చేస్తున్నాయి. మన ప్లేట్‌లో ఏం పెడుతున్నామో… మన జీవితాన్ని అదే నిర్ణయిస్తుంది.

గమనిక: ప్రతి వ్యక్తి శరీర పరిస్థితి వేరు. కొత్త డైట్ లేదా లైఫ్ స్టైల్ మార్పులు ప్రారంభించే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

The post జిమ్ లేకుండా ఫిట్‌గా ఉంటున్న దేశాలు ఇవే!.. వారి లైఫ్ స్టైల్ సీక్రెట్ ఇదే! appeared first on Manalokam – Latest Telugu News & Updates.