July 15, 2026

Motorola Razr Fold: మోటరోలా రేజర్ ఫోల్డ్ త్వరలో భారత్ లో విడుదల.. 80W ఛార్జింగ్, 6000mAh బ్యాటరీ

Motorola Razr Fold: మోటరోలా రేజర్ ఫోల్డ్ త్వరలో భారత్ లో విడుదల.. 80W ఛార్జింగ్, 6000mAh బ్యాటరీ
Reading Time: < 1 minute
Motorola Razr Fold Motorola Motorola Razr Fold India Launch Motorola Razr Fold Specifications

మోటరోలా తన మొదటి బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ రేజర్ ఫోల్డ్ ను త్వరలో భారత్ లో విడుదల చేయనుంది. ఈ హ్యాండ్‌సెట్ ఇటీవల అమెరికాలో విడుదలైంది. భారత్‌లో లాంచ్‌కు ముందుగా ఫ్లిప్‌కార్ట్‌పై ప్రత్యేక మైక్రోసైట్ ప్రారంభించింది. మోటరోలా రేజర్ ఫోల్డ్ భారత్‌లో మే నెలలో విడుదల కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా అధికారికంగా విక్రయించబడుతుందని ధృవీకరించింది. మైక్రోసైట్‌లో ఫోన్ నలుపు రంగులో టీజ్ చేశారు. ఖచ్చితమైన విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. అయితే చైనాలో మే 19న ఆవిష్కరణ జరగనుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను మార్చి 2026లో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC)లో మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు. అమెరికాలో ఏప్రిల్ 29న విడుదలైంది.

ముఖ్య ఫీచర్లు & స్పెసిఫికేషన్స్

ప్రాసెసర్: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 (3nm) ఆక్టా-కోర్ చిప్‌సెట్ (3.8GHz వరకు)
RAM & స్టోరేజ్: 16GB LPDDR5x RAM వరకు, 512GB UFS 4.1 స్టోరేజ్ వరకు
బ్యాటరీ: 6,000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్
50W వైర్‌లెస్ ఛార్జింగ్

డిస్‌ప్లేలు:లోపలి స్క్రీన్: 8.1 అంగుళాల 2K LTPO pOLED (2484 x 2232), 120Hz రిఫ్రెష్ రేట్, 6,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
బయటి స్క్రీన్: 6.6 అంగుళాల LTPO pOLED (1080 x 2520), 165Hz రిఫ్రెష్ రేట్, 6,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 3

ఇతర ఫీచర్లు: IP49 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్, అడ్రెనో A829 GPU, క్వాల్‌కామ్ AI ఇంజిన్

మోటరోలా రేజర్ ఫోల్డ్ ప్రీమియం డిజైన్, శక్తివంతమైన పెర్ఫార్మెన్స్ పెద్ద బ్యాటరీతో భారతీయ మార్కెట్‌లో బలమైన పోటీ ఇవ్వనుంది.