July 15, 2026

NBKxKoratalaSiva : బాలయ్య కోసం రంగంలోకి అనిరుధ్.. ‘లయన్ కా హుకుమ్’

NBKxKoratalaSiva : బాలయ్య కోసం రంగంలోకి అనిరుధ్.. ‘లయన్ కా హుకుమ్’
Reading Time: < 1 minute
Balayya Koratala Siva Movie Anirudh Finalized As Music Director

నందమూరి బాలకృష్ణ  హీరోగా డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక భారీ చిత్రం పట్టాలెక్కబోతోంది. SLV సినిమాస్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జస్ట్ అనౌన్స్మెంట్ తోనే ఈ సినిమాకు భారీ హైప్ వచ్చింది. ఈ క్రేజీ కాంబో గురించి ఫిల్మ్ నగర్‌లో రకరకాల వార్తలు వినిపిస్తుండగా తాజాగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మరియు ఓపెనింగ్ డేట్‌కు సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్స్ బయటకు వచ్చాయి.

ఈ చిత్రానికి సంగీతం దర్శకుడిగా తమిళ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వర్క్ చేయబోతున్నాడు . సాధారణంగా బాలయ్య సినిమాలకు ఎస్.ఎస్. తమన్ లేదా కొరటాల సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్‌ ఆస్థాన సంగీత దర్శకులుగా ఉండేవారు. అయితే ఈసారి వారిద్దరినీ కాదని ప్రస్తుత సౌత్ ఇండియా ట్రెండ్ సెట్టర్ అనిరుధ్ వైపు మొగ్గు చూపడం విశేషం. బాలయ్య మాస్ ఎనర్జీకి అనిరుధ్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం పూజా కార్యక్రమం మే 9న గ్రాండ్‌గా జరగనుంది. ఈ సినిమాలో బాలయ్య CM పాత్రలో కనిపిస్తున్నట్టు ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కొరటాల శివ మార్క్ సోషల్ మెసేజ్‌తో పాటు బాలయ్య స్టైల్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నాయని సమాచారం. అనిరుధ్ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఒక్కసారిగా స్కై లెవల్ కు చేరుకున్నాయి. త్వరలోనే ఈ సినిమాలోని ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది.