
చెన్నై: విజయ్ బ్యాంకు అకౌంట్లో 213 కోట్ల రూపాయల డబ్బు ఉంది. ఈ విషయాన్ని విజయ్ స్వయంగా తన అఫిడవిట్లో ఎన్నికల సంఘానికి తెలియజేశారు. 2026 మార్చి 27 నాటికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సాలిగ్రామం బ్రాంచ్‌లోని తన సేవింగ్స్ అకౌంట్లో రూ. 213.36 కోట్ల నగదు ఉందని అఫిడవిట్లో విజయ్ స్పష్టం చేశారు. అంతేకాదు.. రూ.100 కోట్లకు నాలుగు బ్యాంకుల్లో విజయ్ పేరిట ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి.
యాక్సిస్ బ్యాంక్, ఇందిరా నగర్ బ్రాంచ్: రూ. 40 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కోడంబాక్కం శాఖ: రూ. 25 కోట్లు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, బేసంత్ నగర్ బ్రాంచ్: రూ. 20 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, శాస్త్రి నగర్ బ్రాంచ్: రూ. 15 కోట్లు.. ఇలా మొత్తం రూ.100 కోట్ల ఫిక్డ్స్ డిపాజిట్లు విజయ్ చేయడం గమనార్హం. అంటే.. మొత్తంగా విజయ్ కు మార్కెట్ రిస్క్తో సంబంధం లేని రూ.313 కోట్ల డబ్బు విజయ్ దగ్గర ఉంది.
►ALSO READ | TVKకి సపోర్ట్ చేసేదెవరో క్లారిటీ వచ్చేసింది.. తమిళనాడులో విజయ్కు కాంగ్రెస్ మద్దతు !
విజయ్ పేరిట స్టాక్ మార్కెట్‌లో ఉన్న పెట్టుబడి చాలా తక్కువ. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఆర్కైవ్ చేసిన అఫిడవిట్ ప్రకారం.. జయ నగర్ ప్రాపర్టీ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ. 19.03 లక్షల విలువైన షేర్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో రూ. 9,600 విలువైన షేర్లు, మరియు సన్ పేపర్ మిల్ లిమిటెడ్‌లో రూ. 25,000 విలువైన షేర్లు ఉన్నట్లు విజయ్ ప్రకటించారు.
వీటి మొత్తం ఈక్విటీ వాటా రూ. 19.37 లక్షలు, లేదా ఆయన ప్రకటించిన నికర ఆస్తి విలువలో 0.04 శాతం కంటే తక్కువ. మ్యూచువల్ ఫండ్‌లు, బాండ్‌లు లేదా డిబెంచర్‌లు ఏవీ ఆయన తన అఫిడవిట్లో ప్రకటించకపోవడం గమనార్హం.