
చెన్నై: తమిళనాడులో అనూహ్య విజయం సాధించి అధికారానికి కూత వేటు దూరంలో నిలిచిన విజయ్ టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు తెలిపింది. తమిళనాడులో కాంగ్రెస్ మద్దతుతో విజయ్ సీఎం అవుతున్నాడని తేలిపోయింది. తమిళనాడులో ఐదు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
Rahul + Vijay! 🔥 #Thalapathy #RahulGandhi #TamilNadu #TVK pic.twitter.com/9fwOPymXFp
— Bihar Congress (@INCBihar) May 5, 2026
విజయ్ టీవీకే పార్టీ 108 అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ మద్దతు తెలిపేందుకు ముందుకు రావడంతో టీవీకే బలం 113కి చేరింది. సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీల నుంచి ఇద్దరేసి ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ మూడు పార్టీల నుంచి ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు విజయ్కు ఉన్నట్టే. సో.. మొత్తం కలిపితే 119.
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం నుంచి మన్నార్గుడి నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఎస్.కామరాజ్ కూడా విజయ్ పార్టీకే మద్దతు తెలుపుతారని ప్రచారం జరుగుతోంది. ఈ మ్యాజిక్ ఫిగర్ను దాటేసే అవకాశాలే ఉండటంతో టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, విజయ్ సీఎం కావడం ఖాయంగా కనిపిస్తుంది.
విజయ్ పార్టీ కాంగ్రెస్ మద్దతు కోరిందని కేసీ వేణు గోపాల్ ఇప్పటికే ప్రకటించారు. అధిష్టానం కూడా ఈ నిర్ణయాన్ని తమిళనాడు కాంగ్రెస్కే వదిలేసిందని ఆయన చెప్పారు. టీవీకే విజయాన్ని అభినందిస్తూ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్కు విజయ్ స్పందించిన తీరు కూడా హస్తం పార్టీతో టీవీకే విజయ్ పార్టీ స్నేహం చేయనుందని స్పష్టం చేసింది.