Reading Time: 2 minutes

సంతోషం కోసం పెట్టుకునే డీజే సౌండ్లు.. నేడు చావుకు డప్పు కొడుతున్నాయి. పెళ్లిళ్లు, జాతరలు, నిమజ్జనాల్లో చిందులేస్తూ యువత ప్రాణాలు వదలడం కలచివేస్తోంది. అది కేవలం సంగీతం కాదు, గుండె లయను తప్పించే మృత్యుఘోష అని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. 22 ఏళ్ల కుర్రాడి నుంచి వృద్ధుల వరకు ఈ శబ్దాల హోరుకు బలైపోతున్నారు. వినోదం పేరిట మనం కొని తెచ్చుకుంటున్న ఈ విపత్తు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

చిందులేస్తూనే అనంత లోకాలకు: ఈ మధ్య కాలంలో డీజే బాక్సుల ముందు డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోతున్న ఘటనలు పెరిగిపోయాయి. బొబ్బాదిపేటలో 22 ఏళ్ల హరీష్, కోనసీమలో మరో వ్యక్తి డీజే హోరులోనే ప్రాణాలు కోల్పోయారు. ఇక మనం ఎంజాయ్ చేస్తున్నామనుకునే ఆ భారీ శబ్దం, మనకు తెలియకుండానే శరీరంలో పెను మార్పులు తెస్తోంది.

గుండెపై డీజే దెబ్బ: జర్మనీలోని మెయిన్జ్ వర్సిటీ పరిశోధన ప్రకారం, శబ్దం పరిమితి దాటితే గుండె కొట్టుకునే వేగం మారిపోతుంది. డీజే సౌండ్ వల్ల కలిగే వైబ్రేషన్లు గుండెను ఒత్తిడికి గురిచేస్తాయి. ఇక దీనివల్ల రక్తపోటు అమాంతం పెరిగి, గుండె ఆగిపోవడం లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం పొంచి ఉంది.

Extreme Noise Turns Life-Threatening:
Extreme Noise Turns Life-Threatening:

వృద్ధులు, గర్భిణుల పరిస్థితి ఏంటి?: వృద్ధులు, ఇప్పటికే గుండె ఆపరేషన్ చేయించుకున్న వారు ఈ శబ్దాల దెబ్బకు త్వరగా ప్రభావితమవుతారు. గర్భిణుల విషయంలో ఇది ఇంకా ప్రమాదకరం. 4వ నెల నుంచి గర్భిణులు ఈ శబ్దాలకు దూరంగా ఉండాలి. ఇక లేదంటే గర్భంలోని శిశువుకు గుండె దడ రావడం, కొన్నిసార్లు అబార్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

వినికిడి కోల్పోయే ప్రమాదం: సాధారణంగా మనం వినే శబ్దం కంటే డీజే శబ్దం 100 డెసిబుల్స్ దాటి ఉంటుంది. ఇలాంటి శబ్దాన్ని ఎక్కువ సేపు వింటే చెవిలోని సున్నితమైన పొరలు దెబ్బతింటాయి. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇది శాశ్వత వినికిడి లోపానికి దారితీస్తుంది. ఇక కేవలం మనుషులకే కాదు మూగజీవాలకు కూడా ఈ శబ్దాలు నరకం చూపిస్తున్నాయి.

సంతోషం అంటే పది మందితో పంచుకునేది, పది మంది ప్రాణాలను ఇబ్బంది పెట్టేది కాదు. సంప్రదాయ పద్ధతుల్లో వేడుకలు చేసుకోవడం ఉత్తమం. డీజే సంస్కృతికి దూరంగా ఉండి, ప్రాణాలను కాపాడుకుందాం.

గమనిక: మీ వీధిలో లేదా ఊరిలో అనుమతి లేకుండా భారీ శబ్దాలతో డీజేలు పెడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. చట్టరీత్యా శబ్ద కాలుష్యం నేరం. మీ జాగ్రత్తే మీ ప్రాణానికి రక్షణ!

The post భారీ శబ్దం ప్రాణాలకు ముప్పు.. ఈ జాగర్త అవసరం appeared first on Manalokam – Latest Telugu News & Updates.