Reading Time: 2 minutes

నన్ను టీ20 ప్లేయర్గా చూడలేదు: కెరీర్లో ఆటుపోట్లపై కేఎల్ రాహుల్ ఎమోషనల్

Caption of Image.

కెరీర్ లో ఏదీ తను  అనుకున్నట్లు జరగలేదని ఎమోషనల్ అయ్యాడు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్. ముఖ్యంగా టీ20 ఇంటర్నేషనల్  కెరీర్ లో తనకు కాలం కలిసిరాలేదన్నాడు. తనను ఒక టెస్టు ప్లేయర్ గానే ముద్ర వేశారని ఎమోషనల్ అయ్యాడు. ఆ ముద్ర చెరిపేసుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందని తెలిపాడు. 

ఐపీఎల్ 2026 లో ఢిల్లీ తరఫున వీర విహారం చేస్తున్న రాహుల్.. ఈ సీజన్ లో టాప్ బ్యాటర్ గా ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. 9 మ్యాచ్ లలో 185 స్ట్రైక్ రేట్ తో 433 రన్స్ చేసి వారెవ్వా అనిపిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ పైన 64 బంతులలో 152 రన్స్ చేసి రాహుల్ క్లాస్ పర్ఫామెన్స్ అదో లెవెల్ అనిపించుకున్నాడు. 

ఐపీఎల్ లో ఇంత అద్భుత పర్ఫామెన్స్ ఇస్తున్న కేఎల్ కు.. 2022 నుంచి టీ20 జట్టులో చోటు దక్కడం లేదు. వన్డే, టెస్టులలో రెగ్యులర్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తున్నప్పటికీ తనను టెస్టు ప్లేయర్ గా చూస్తూ.. టీ20లో గుర్తించకపోవడంపై రాహుల్ తన మనసులోని అసంతృప్తిని.. త్వరలో టీ20 టీమ్ లో చోటు దక్కుతుందేమోననే ఆశాభావంతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. 

►ALSO READ | లక్ష్యం తప్పిన ఆర్చరీ.. షాంఘైలో భారత్‌‌కు అగ్నిపరీక్ష

జియో స్టార్ నిర్వహించిన సూపరర్ స్టార్స్ ప్రోగ్రాంలో .. ఈ పదేళ్లలో తన ప్రోగ్రెస్ పై సంతృప్తిగా ఉన్నట్లు చెప్పాడు. పదేళ్ల క్రితం.. టీ20 లో చోటు దక్కించుకునేందుకు నా బెస్ట్ ఇచ్చేవాడిని. కానీ నన్ను టీ20 ప్లేయర్ గా పరిగణించలేదు. కనీసం వైట్ బాల్ ప్లేయర్ గా కూడా చూడలేదు. టెస్ట్ ప్లేయర్ గానే ముద్ర వేశారు. 

ఈ ముద్ర తొలగించుకోవడానికి.. వైట్ బాల్ గేమ్ లో మరింత మెరుగుపడినట్లు చెప్పాడు. ఇప్పుడు తన పర్ఫామెన్స్ పై సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. అదేసమయంలో కొన్ని తప్పులు కూడా చేసినట్లు చెప్పాడు. అయితే ప్రతి సందర్భంలో బెస్ట్ ఇవ్వడానికి తన వంతుగా కష్టపడినట్లు చెప్పాడు. ఇప్పుడు నాకు ఇంకా కొంత టైమ్ ఉంది.. ఇదే ఊపులో ఆడతా.. చూడాలి ఎన్ని ట్రోఫీలు అందుకుంటానో .. అంటూ చెప్పుకొచ్చాడు. 

©️ VIL Media Pvt Ltd.