
తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ అనూహ్య విజయం సాధించింది. రేపోమాపో విజయ్ జోసెఫ్ తమిళనాడుకు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ తరుణంలో.. విజయ్ విడాకుల కేసు మరోసారి తెరపైకొచ్చింది. విజయ్ నుంచి ఆయన భార్య సంగీత విడాకులు కోరిన సంగతి తెలిసిందే. ఒక సినీ నటితో విజయ్ రిలేషన్లో ఉన్నాడని.. ఇక విజయ్తో కలిసి ఉండలేనని విజయ్ భార్య సంగీత కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. విజయ్ పొలిటికల్ కెరీర్కు ఈ పరిణామం చేటు చేస్తుందని ప్రచారం జరిగింది.
అయితే.. విజయ్ వ్యక్తిగత జీవితంలోని వివాదాలను తమిళనాడు ఓటర్లు ఏమాత్రం పట్టించుకోలేదు. విజయ్లో ఒక ‘జన నాయగన్’ ను మాత్రమే చూశారు. విజయ్ టీవీకే పార్టీని 108 సీట్లలో గెలిపించారు. అయితే.. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. విజయ్ విడాకుల కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సంగీత ఫిబ్రవరిలో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును విచారించిన చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు జూన్ 15, 2026న విజయ్, సంగీత తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.
అయితే.. విజయ్ ముఖ్యమంత్రి అవడం ఖాయమైన క్రమంలో.. ఈ విడాకుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి విజయ్కి కోర్టు మినహాయింపు ఇస్తుందో.. లేదో అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ.. వ్యక్తిగతంగా తప్పక హాజరవ్వాల్సిన పరిస్థితి వస్తే విడాకుల కేసులో కోర్టుకు హాజరైన సీఎం అనే ప్రచారం జోరుగా నడవడం ఖాయం. పైగా.. విజయ్, త్రిష బంధానికి ఎన్నికల్లో గెలుపుతో జనామోదం కూడా లభించిందని టీవీకే పార్టీ భావిస్తుండటం గమనార్హం.
►ALSO READ | ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం.. ఇన్ని పదవులు నిర్వర్తించిన మమతకు ఎంత పెన్షన్ వస్తుంది..? రూల్స్ ఏం చెబుతున్నాయి…?
సంగీత సీఎం భార్య హోదాను కోల్పోయిందని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు మాత్రం సంగీత విడాకుల నిర్ణయాన్ని సమర్థించారు. భర్త మరొకరితో సంబంధంలో ఉన్నాడని తెలిసి కూడా హోదా కోసం ఆత్మ గౌరవాన్ని చంపుకుని బతకాల్సిన అవసరం లేదని సంగీతకు మద్దతుగా నిలిచారు.
విజయ్ పాలిటిక్స్లో సక్సెస్ అయినప్పటికీ ఈ విడాకుల ఎపిసోడ్ మాత్రం విజయ్ పర్సనల్ లైఫ్ చుట్టూ పుకార్లకు కారణమవుతున్న పరిస్థితి ఉంది. సంగీత కోరిన భరణం ఇచ్చేందుకు విజయ్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నారని.. అందుకే సంగీత సైలెంట్ అయిందని తమిళ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. త్రిషను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొస్తే మాత్రం విజయ్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలవడం ఖాయం.
విజయ్ రెండు చోట్ల పోటీ చేసి గెలవడంతో ఒకచోట రాజీనామా చేయడం అనివార్యం. తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి విజయ్ రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ స్థానం నుంచి ఉప ఎన్నికలో త్రిష పోటీ చేయడం ఖాయమని.. విజయ్ ఇప్పటికే ఈ మేరకు త్రిషకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని తమిళ మీడియాలో హాట్ హాట్గా డిస్కషన్స్ నడుస్తున్నాయి.