Reading Time: < 1 minute

KMP ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు పోలీసులు స్పాట్ డెడ్

Caption of Image.

చండీగఢ్: హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే మరణించారు. ధులావత్ టోల్ ప్లాజా సమీపంలో కుండ్లి-మనేసర్-పల్వాల్ (KMP) ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం (మే 5) ఉదయం  ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. 

మృతులను ఉత్తరప్రదేశ్‎లోని జలౌన్ జిల్లాకు పోలీస్ సిబ్బందిగా గుర్తించారు. ముందున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ధాటికి వాహనంలో ఉన్న ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారని అధికారులు వెల్లడించారు.

ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సేవల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికితీసి పోస్ట్‎మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

 

©️ VIL Media Pvt Ltd.