
వేసవిలో అందర్నీ ఇబ్బంది పెట్టే సమస్య చెమట. చెమటతో పాటు శరీరం నుంచి దుర్వాసన కూడా వస్తుంది. ఇదింకా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. అందుకే చాలా మంది ఫ్రెష్ నెస్ కోసం మార్కెట్ లో దొరికే డియోడరెంట్లు, పర్ ఫ్యూమ్స్ వాడుతుంటారు . అయితే వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలతో కూడా ఈ చెమట వాసనకి చెక్ పెట్టవచు.. అవేంటంటే..
బేకింగ్ సోడా
ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చెమట పట్టే ప్రదేశాల్లో రాసుకోవాలి. కొన్ని నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయాలి. బేకింగ్ సోడా తడిని పీల్చేయడమే కాదు, బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది.
టొమాటో
నీళ్లలో టొమాటో రసాన్ని కలుపుకుని స్నానం చేస్తే చెమట వాసన రాదు. లేదంటే అ రసాన్ని దుర్వాసన వచ్చే చోట్ల రాసుకున్నా సమస్య తీరుతుంది. ముల్లంగి రసంలో గ్లిజరిన్ కలిపి ఉపయోగించినా సరిపోతుంది.
నిమ్మకాయ
చెమట వాసనకు చెక్ పెట్టడానికి నిమ్మకాయ బెస్ట్ ఆప్షన్. నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి, వాటితో అండర్ ఆర్మ్స్ లో రుద్ది పదినిమిషాల తర్వాత శుభ్రం చేయాలి.. వేడినీళ్లలో నిమ్మరసం కలిపి, అందులో దూది ముంచి రుద్దుకున్నా దుర్వాసన రాదు.
గ్రీన్ టీ
గ్రీన్ టీ లో ఉండే టానిన్లు చర్మాన్ని పొడిగా ఉంచుతాయి. చెమట, దుర్వాసన లాంటి సమస్యలను నివారిస్తాయి. ఒక లీటర్ వేడి నీళ్లలో రెండు గ్రీన్ టీ బ్యాగులను పది నిమిషాలు ఉంచి తీసేయాలి. ఆ నీళ్లని డైరెక్ట్ చెమటపట్టే భాగాల్లో అప్లై చేస్తే దుర్వాసన పోతుంది.
రోజ్ మేరీ
రోజ్ మేరీ ఆకులతో కూడా చెమట వాసనకి చెక్ పెట్టొచ్చు. రోజూ స్నానం చేసే నీళ్లలో ఆకుల రసాన్ని పోసి.. పది నిమిషాల తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది.
హైడ్రోజన్ పెరాక్సైడ్
వాడేసిన టీపొడిని అండర్ అర్మ్స్ లో బాగా రుద్దుకని పదినిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కుంటే దుర్వాసన రాదు. లేదంటే నీళ్లలో టీ పొడి వేసి మరిగించి, వడకట్టి, అందులో నిమ్మరసం కలపాలి. అలాగే ఓ కప్పు నీళ్లలో ఒక టీ స్పూన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి బాగా కలపాలి. ఓ శుభ్రమైన క్లాత్ ని ఈ మిశ్రమంలో ముంచి అండర్ ఆర్మ్స లో రాయాలి. కొన్ని రోజులు ఇలా చేస్తే దుర్వాసన పోతుంది.
టీట్రీ ఆయిల్స్
చెమట ఎక్కువగా ఉన్న చోట టీట్రీ ఆయిల్ తో శుభ్రంగా తుడుచుకోవాలి. అలాగే నేచురల్ యాంటీ సెప్టిక్స్ ఉపయోగించడం వల్ల శరీరంలో ఉన్న బ్యాక్టీరియా పోతుంది. టాల్కమ్ పౌడర్ ను ఉపయోగించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.