
సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి సినిమా కోసం అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా రాకపోతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ వరల్డ్ లెవల్ లో ఉండబోతుంది. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా.. తెలుగు సినిమా స్థాయిని మరో లెవల్ కు తీసుకెళ్లేలా.. ప్రపంచం మొత్తం మన సినిమా వైపే చూసేలా వారణాసి సినిమాను తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న వారణాసిలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటించనున్నాడు.
ఇది కూడా చదవండి : ఆ హీరో పిలిచి తిడతాడనుకున్నా.. కానీ ఆయన చేసిన పనికి షాక్ అయ్యా
అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. అంతే కాదు రకరకాల గెటప్స్ లో మహేష్ కనిపిస్తారని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే మహేష్ బాబు రాముడిగా కనిపించనున్నారని రాజమౌళి లీక్ చేశారు. దాంతో అభిమానుల్లో ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆ మధ్య వారణాసి సినిమా అనౌన్స్ మెంట్ వీడియో విడుదల చేశారు రాజమౌళి. ఆ టీజర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వారణాసి టీమ్ కు చిన్న బ్రేక్ ఇచ్చారు రాజమౌళి.
ఇది కూడా చదవండి : Talluri Rameswari: నా రెమ్యునరేషన్ గురించి ఆ స్టార్ హీరో అలా అనేసరికి షాక్ అయ్యా..!
దాంతో మహేష్ విదేశాలకు వెళ్లిపోయారు. అయితే తాజాగా మహేష్ బాబు షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. ప్రస్తుతం మహేష్ బాబు జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ లో ఉన్నారు. ఫిట్‌నెస్, వెల్‌నెస్ నిపుణులు డాక్టర్ హ్యారీ కోనిగ్ తో కలిసి బ్లాక్ ఫారెస్ట్ లో ట్రెక్కింగ్ చేస్తున్నారు మహేష్ బాబు. సినిమాలో యాక్షన్ సీన్స్ , అడ్వాంచర్ సీన్స్ కోసం మహేష్ శిక్షణ తీసుకుంటున్నారు. అందులో భాగంగానే బ్లాక్ ఫారెస్ట్ ట్రెక్కింగ్ చేస్తున్నారు. ట్రెక్కింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంటూ వారణాసి కోసం సిద్ధమవుతున్నట్లు క్యాప్షన్ పెట్టారు.దాంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మహేష్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.