Reading Time: 2 minutes
Vaibhav Suryavanshi : రాజస్థాన్ రాయల్స్‌కు వైభవ్ గుడ్ బై.. రూ.30కోట్లతో ఆ టీంలోకి వెళ్లడం పక్కా ?

Vaibhav Suryavanshi : ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఒకటే పేరు మార్మోగిపోతుంది.. అదే వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే బుమ్రా, ప్యాట్ కమిన్స్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను ఉతికి ఆరేస్తున్న ఈ చిచ్చరపిడుగు ఇప్పుడు ఐపీఎల్ హాట్ టాపిక్‌గా మారాడు. రాజస్థాన్ రాయల్స్ డైమండ్ మీద ఇప్పుడు దిగ్గజ జట్ల కన్ను పడిందఈ అద్భుత వజ్రంపై ఇప్పుడు దిగ్గజ జట్ల కన్ను పడింది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ వంటి భారీ జట్లు వైభవ్ సూర్యవంశీ కోసం గాలం వేసే అవకాశం ఉందంటూ ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ రాయల్స్ తన పోస్టర్ బాయ్‎ని కాపాడుకోవడం అంత సులువు కాదని వార్నింగ్ ఇచ్చాడు.

ఇంగ్లాండ్ మాజీ దిగ్గజం స్టువర్ట్ బ్రాడ్ ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంటుకు ఒక కీలకమైన విషయాన్ని గుర్తు చేశారు. “రాజస్థాన్ స్కౌటింగ్ టీంను అభినందించాల్సిందే. 13 లేదా 14 ఏళ్ల వయసున్న కుర్రాడిని ఐపీఎల్ వేలంలో రూ.1.1 కోట్లకు కొనుగోలు చేయడం అప్పట్లో విచిత్రంగా అనిపించింది. కానీ ఇప్పుడు అతను చూపిస్తున్న ఆట అద్భుతం. అయితే, రాజస్థాన్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది.. ఐపీఎల్‌లో ఏ ఆటగాడితోనూ 10 ఏళ్ల కాంట్రాక్ట్ కుదుర్చుకోలేం. వైభవ్ ఒకవేళ వేలంలోకి వస్తే రూ.30 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు. ముంబై ఇండియన్స్ వంటి పెద్ద జట్లు అతడిని సొంతం చేసుకునేందుకు రెడీగా ఉంటాయి” అని బ్రాడ్ విశ్లేషించారు.

వైభవ్ అంటే ఇప్పుడు కేవలం ఒక యంగ్ ప్లేయర్ మాత్రమే కాదు. ఒక బాక్సాఫీస్ అట్రాక్షన్. జస్ప్రీత్ బుమ్రా, ప్యాట్ కమిన్స్, జోష్ హాజల్‌వుడ్ వంటి ప్రపంచ మేటి బౌలర్లను ఎదుర్కొంటూ.. వారి బౌలింగ్‌లో మొదటి బంతికే సిక్సర్ బాదడం ఈ 15 ఏళ్ల కుర్రాడికే చెల్లింది. రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ కూడా వైభవ్ ఆటకు ఫిదా అయిపోయాడు. “క్రిస్ గేల్, సెహ్వాగ్ వంటి దిగ్గజాలు 30 ఏళ్ల వయసులో ఎంత భయం లేకుండా ఆడారో, వైభవ్ 15 ఏళ్లకే అంత ధైర్యంగా ఆడుతున్నాడు. అతను బ్యాటింగ్ చేస్తుంటే టీవీ ఆన్ చేసి చూడాలనిపిస్తుంది” అని బట్లర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఎప్పుడూ ముంబై, చెన్నై, బెంగళూరు జట్లలా భారీ ఫ్యాన్ బేస్ ఉండేది కాదు. సంజూ శాంసన్ వంటి ఫేస్ ఉన్నప్పటికీ, వైభవ్ ఎంట్రీతో రాజస్థాన్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ఒకవేళ వచ్చే వేలంలో వైభవ్ గనుక వేలంలోకి వస్తే, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలుస్తాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేవలం 1.1 కోట్ల పెట్టుబడితో రాజస్థాన్ ఇప్పుడు వందల కోట్ల విలువైన గుర్తింపును పొందుతోంది. కానీ బ్రాడ్ హెచ్చరించినట్టుగా, ఇతర ఫ్రాంచైజీల నుంచి వచ్చే భారీ ఆఫర్లను రాజస్థాన్ ఎలా తట్టుకుంటుంది అనేది చూడాలి.

సచిన్ టెండూల్కర్, ధోనీ, కోహ్లీ సరసన వైభవ్ సూర్యవంశీ పేరు కూడా త్వరలోనే చేరిపోతుందని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. విఫలమైన మరుసటి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగడం వైభవ్ మానసిక దృఢత్వానికి నిదర్శనం. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై డకౌట్ అయినా, మళ్ళీ అదే జట్టుపై వంద పరుగులు చేయడం సామాన్య విషయం కాదు. అందుకే ఈ వండర్ కిడ్ కోసం రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య భవిష్యత్తులో గట్టి పోటీ ఉండబోతోందని స్పష్టమవుతోంది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..