Reading Time: 2 minutes
JD Chakravarthy: సెట్‌కు ఆలస్యం.. రాత్రి తాగింది దిగలేదన్నారు.. ఆ స్టార్ హీరోపై జేడీ చక్రవర్తి సంచలన కామెంట్స్

టాలీవుడ్‌ హీరో జేడీ చక్రవర్తి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాలిటీస్ లో ఆయన కూడా ఒకరు. హీరోగా, విలన్ గా, డైరెక్టర్ గా సత్తా చాటారాయన. అయితే గతంలోలా ఇప్పుడు జేడీ పెద్దగా సినిమాలు చేయడం లేదు. అప్పుడప్పుడు మాత్రమే సినిమాల్లో మెరుస్తున్నాడు. అలా జేడీ చక్రవర్తి నటించిన లేటెస్ట్ సినిమా గాయపడ్డ సింహం. తరుణ్ భాస్కర్, ఫరియా అబ్ధుల్లా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు జేడీ. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. అయితే లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో జేడీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

‘మనం అభిమానించే వ్యక్తుల గురించి అసలు విషయాలు తెలియకుండానే గౌరవం పెంచుకుంటే అది పొరపాటే. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక నటుడు అంటే నాకు చాలా రెస్పెక్ట్‌. కానీ, అతని పేరు మాత్రం చెప్పను. ఆ హీరో అంటే నాకు మాత్రమే కాదు.. యావత్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇండియాకు కూడా ఆయన అంటే చాలా గౌరవం. అలాగే నిజ జీవితంలో ఉంటారని అనుకున్నాను. కానీ, సినిమా సెట్స్‌కు ఆయన ఆలస్యంగా వస్తారు సార్‌ అని నాతో కొందరు చెప్పారు. ఎందుకంటే..? రాత్రి తాగింది దిగలేదన్నారు’

ఆ మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. నిజమా..! ఆయన తాగుతారా..? అని పలు సార్లు అడిగాను. ఆయనకు అప్పటికే వయసు అయిపోయింది. హోటల్‌లో కూడా బస చేయడం లేదని చెప్పారు. ప్రస్తుతం తన గర్ ల్‌ఫ్రెండ్‌తో ఉంటున్నారనడంతో ఆయనకు పెళ్లైంది కదా అన్నాను. లేదు ఆయన గర్ల్‌ఫ్రెండ్‌తోనే ఉంటున్నారని చెప్పారు. ఆ రోజు వరకు ఆయనకున్న ఇమేజ్‌ను బట్టి నేను కూడా మహానుభావుడు అనుకున్నాను.కానీ రియాలిటీ మరోలా ఉంది’ అని జేడీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ సీనియర్ నటుడి కామెంట్స్, అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారాయి. అయితే, ఆ స్టార్‌ హీరో ఎవరు అనేది మాత్రం జేడీ రివీల్‌ చేయలేదు.

జేడీ చక్రవర్తి కామెంట్స్.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.