
India Defense New Weapons: భారత రక్షణ వ్యవస్థ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్‌కు ముందు.. ఆపరేషన్ సింధూర్ తర్వాత అనే తరహాలో కీలక మార్పులు చేసింది.. గత ఏడాదిలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత ప్రభుత్వం సైనిక సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి వేగంగా చర్యలు చేపట్టింది. కొత్త ఆయుధాల కొనుగోలు, పాత వ్యవస్థల ఆధునీకరణ, స్వదేశీ రక్షణ తయారీకి ప్రాధాన్యం వంటి అంశాలు ఈ ఏడాది ప్రధానంగా నిలిచాయి.
2025 మేలో జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత భవిష్యత్ యుద్ధాలు డ్రోన్లు, సుదూర క్షిపణులు, వాయు రక్షణ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ యుద్ధంపై ఆధారపడతాయని స్పష్టమైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అత్యవసర కొనుగోళ్లకు ఆమోదం తెలిపి, భారీ స్థాయిలో ఆయుధ సేకరణ ప్రారంభించింది.
భారీ మొత్తంలో రక్షణ కొనుగోళ్లు
రక్షణ సేకరణ మండలి (DAC) పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. లక్షల కోట్ల రూపాయల విలువైన ఆయుధాలు కొనుగోలు చేసినట్లు సమాచారం. అత్యవసర సేకరణ కింద కూడా వేల కోట్ల రూపాయల ఒప్పందాలు కుదిరాయి.
కొత్తగా చేరిన ప్రధాన ఆయుధాలు
* గత ఏడాదిలో భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళంలోకి 15 నుంచి 20 ప్రధాన ఆయుధ వ్యవస్థలు చేరినట్లు అంచనా.
* Pinaka Rocket Systemకు అదనంగా రెండు రెజిమెంట్లు
* దీర్ఘ శ్రేణి గైడెడ్ పినాకా రాకెట్ విజయవంత పరీక్షలు
* AH-64E Apache హెలికాప్టర్లు
* 850కు పైగా కమికాజీ డ్రోన్లు, నిఘా డ్రోన్లు
* S-400 Triumph అదనపు క్షిపణులు
* HAL Tejas Mk1A 97 యుద్ధ విమానాలు
* Astra Mk-II క్షిపణులు
* నౌకాదళానికి మైన్ కౌంటర్ వెస్సెల్స్, కమ్యూనికేషన్ వ్యవస్థలు
* జావెలిన్ యాంటీ ట్యాంక్ క్షిపణులు, నిఘా విమానాలు
కొత్త కొనుగోళ్లతో పాటు ఇప్పటికే ఉన్న ఆయుధాలను కూడా ఆధునీకరించారు.
* Sukhoi Su-30MKI జెట్‌లకు కొత్త రాడార్, ఏవియానిక్స్
* T-90 Tank ట్యాంకులకు నైట్ సైట్స్, ఫైర్ కంట్రోల్ సిస్టమ్‌లు
* S-400 Triumph నిర్వహణ, అదనపు మిస్సైల్ సామర్థ్యం
* Mil Mi-17 హెలికాప్టర్లకు జీవితకాల పొడిగింపు
* BrahMos వ్యవస్థలకు కొత్త లాంచర్లు
* పినాకా రాకెట్ వ్యవస్థకు విస్తరించిన శ్రేణి వెర్షన్
స్వదేశీ ఆయుధాలకు ప్రాధాన్యం
ఈ ఏడాది జరిగిన ప్రధాన మార్పుల్లో ‘మేడ్ ఇన్ ఇండియా’ రక్షణ ఉత్పత్తులకు పెద్దపీట వేయడం ముఖ్యమైనది. BrahMos, Pinaka Rocket System, HAL Tejas Mk1A, Akash Missile వంటి ఆయుధాలకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ పెరిగింది.
భారత రక్షణ శక్తి మరింత బలోపేతం
కొత్త ఆయుధాల చేర్పు, పాత వాటి ఆధునీకరణతో మూడు దళాల ఫైర్‌పవర్, డ్రోన్ యుద్ధ సామర్థ్యం, వాయు రక్షణ, సముద్ర దాడి శక్తి గణనీయంగా పెరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏడాది కాలంలో జరిగిన ఈ మార్పులు భారత రక్షణ రంగానికి కీలక మలుపుగా నిలిచాయని చెప్పవచ్చు.