
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు నేడు తన 73వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సెలబ్రేషన్స్ భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు, రాజకీయ నాయకుల నుండి కార్యకర్తల వరకు అందరూ తమ ప్రియతమ నాయకుడికి సామాజిక మాధ్యమాల వేదికగా ‘మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే’ అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ విషెష్ తెలుపుతూ “గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు మావయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. రాష్ట్ర ప్రజలకు ఇదే విధమైన అంకితభావంతో, దార్శనికతతో సేవ చేయడానికి కావలసిన శక్తిని ఆ భగవంతుడు ఆయనకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. రాష్ట్రాన్నీ మరింత పురోభివృద్ధి వైపు నడిపిస్తూ, శ్రేయస్సుతో పాటు గర్వకారణమైన విజయాలను అందించాలని కోరుకుంటున్నాను’ అని ఎన్టీఆర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. తన మావయ్య నాయకత్వ పటిమ రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలు సృష్టించాలని ఆశిస్తూ ఆయన పెట్టిన పోస్ట్ నందమూరి మరియు నారా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
Many happy returns of the day to the Honourable Chief Minister of Andhra Pradesh, Sri @NCBN Mavayya garu. Wishing you continued good health, happiness, and the strength to lead and serve our people with the same dedication and vision. May your leadership continue to inspire…
— Jr NTR (@tarak9999) April 20, 2026