
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఎంపీలు ఎన్నికల సంఘాన్ని కలవాలని చేసిన ప్రయత్నంపై ఎన్నికల సంఘం స్పందించింది. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు ఏ రాజకీయ పార్టీ కూడా అధికారికంగా అపాయింట్‌మెంట్ కోరలేదని, ఆ తర్వాత వచ్చిన సమావేశ ప్రతిపాదనను నిబంధనలకు విరుద్ధంగా భావించి ఆమోదించలేదని తెలిపింది. ఉదయం కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం వైపు పాదయాత్ర చేపట్టాయని ఆ సందర్భంగా కొంతమంది ఎంపీలు తమ ప్రతినిధి బృందాలతో కమిషన్‌ను కలవాలనుకుంటున్నట్లు మీడియా ద్వారా తెలిసిందని ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే సాయంత్రం 4 గంటల వరకు ఏ పార్టీ ప్రతినిధులు అపాయింట్‌మెంట్ కోరలేదని స్పష్టం చేసింది. సాయంత్రం 4 గంటల తర్వాత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఎంపీల బృందం కమిషన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించాలనుకుంటున్నట్లు ఢిల్లీ పోలీసుల నుంచి సమాచారం అందిందని ఎన్నికల సంఘం తెలిపింది.
రాజకీయ పార్టీలతో సమావేశాల కోసం 2025లో ఒక విధానాన్ని ఏర్పాటు చేసినట్లు, దానిని అన్ని పార్టీలకు తెలియజేసినట్లు ఎన్నికల సంఘం గుర్తు చేసింది. ఏ పార్టీ ప్రతినిధి బృందమైనా, లేదా పలు పార్టీల ఉమ్మడి బృందమైనా కమిషన్‌ను కలవాలనుకుంటే అధికారిక ప్రతినిధి ద్వారా అపాయింట్‌మెంట్ కోరాలని, ఆ తర్వాత ఇరు పక్షాలు అంగీకరించిన సమయంలోనే సమావేశం జరుగుతుందని వివరించింది. సాయంత్రం 4 గంటల తర్వాత ఢిల్లీ పోలీసుల ప్రతిపాదనలో సమావేశం 240 మంది ఎంపీల బృందంతో జరగనున్నట్లు, ప్రతిపాదిత వేదిక పార్లమెంట్ హౌస్ అనెక్స్ అని ఢిల్లీ పోలీస్ డీసీపీ తెలియజేశారని సంఘం వెల్లడించింది. నియమావళి ప్రకారం ఇలాంటి సమావేశాలు ఎన్నికల సంఘం ప్రాంగణంలోనే జరగాలి కాబట్టి ఆ అభ్యర్థనను ఆమోదించలేదని ఎన్నికల సంఘం తెలిపింది. వినతిపత్రాన్ని స్వీకరించేందుకు కమిషన్‌లోని అత్యంత సీనియర్ అధికారిని సమావేశ వేదికకు పంపేందుకు సిద్ధమైనా ఆ ప్రతిపాదనను కూడా ఎంపీలు తిరస్కరించారని చెప్పింది. దేశ పార్లమెంటరీ, ప్రజాస్వామ్య ప్రక్రియలను, తమ నియమనిబంధనలను, సంప్రదాయాలను గౌరవిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఏ రాజకీయ పార్టీ అయినా ఎప్పుడైనా సమావేశం కోసం అభ్యర్థించవచ్చని, సౌకర్యాలను బట్టి సమావేశం ఏర్పాటు చేయవచ్చని, ఇది సహజమైన ప్రక్రియ అని పేర్కొంది.
పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘానికి విపక్ష ఎంపీల సేవ్ డెమోక్రసీ మార్చ్
మంగళవారం ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వైపు మార్చ్ చేపట్టారు. ప్రత్యేక సమగ్ర సవరణ ఓటరు జాబితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు మార్చ్‌ను అడ్డుకోవడంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు ఆకాశవాణి భవన్ ప్రాంగణంలో ధర్నాకు దిగారు. ఆ తర్వాత ధర్నా చేసిన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సుమారు 300 మంది ఎంపీలు కమిషనర్లను కలవాలనుకుంటే పోలీసులు ఆపారని, తాము కోట్లాది మంది ప్రజల ప్రతినిధులమని, ఎన్నికల కమిషనర్లు ఎందుకు కలవడం లేదని ప్రశ్నించారు. కమిషన్ కార్యాలయం కొద్ది దూరంలోనే ఉన్నా తమను అనుమతించలేదని ఆరోపించారు.
Election Commission of India Press Note
Date
— 6 October 2026
Read more
https://t.co/q6CXhdZCdz
#ECI https://t.co/QI0l1wOFlr
— Election Commission of India (@ECISVEEP) October 6, 2026
— 6 October 2026
https://t.co/q6CXhdZCdz