Reading Time: < 1 minute
Bsnl Rs 1 Sim Freedom 2 0 Offer 24 Days Unlimited Calls Data

BSNL Freedom 2.0: రీఛార్జ్ ధరల పెంపుతో ప్రైవేట్ టెలికాం నెట్‌వర్క్‌లైన జియో, ఎయిర్‌టెల్ వినియోగదారుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్న వేళ.. ప్రభుత్వ రంగ దిగ్గజం బీఎస్‌ఎన్‌‌ఎల్ అనూహ్య కౌంటర్ ఇచ్చింది. ప్రైవేట్ కంపెనీల దోపిడీకి చెక్ పెడుతూ, రానున్న దసరా-దీపావళి పండగల సీజన్‌లో వినియోగదారులను ఆకర్షించేందుకు కళ్లు చెదిరే ధమాకా ప్లాన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కేవలం ఒక్క రూపాయి (₹1) చెల్లిస్తే చాలు.. కొత్త సిమ్ కార్డుతో పాటు ఉచిత కాలింగ్, డేటాను సైతం అందిస్తూ మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

‘ఫ్రీడమ్ 2.0’తో ప్రైవేట్ నెట్‌వర్క్‌లకు బిగ్ ట్విస్ట్

కొత్త కస్టమర్లను బీఎస్‌ఎన్‌ఎల్ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా పరిచయం చేసిన ‘ఫ్రీడమ్ 2.0’ ప్లాన్ ఇప్పుడు టెలికాం పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఒక్క రూపాయి ఖర్చు చేస్తే లభించే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి. సిమ్ కార్డు ధర కేవలం రూ. 1 మాత్రమే. అలాగే 24 రోజుల వాలిడిటీతో దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా ఫ్రీగా కాల్స్ మాట్లాడుకునే సదుపాయం. వీటితో పాటు ప్రతిరోజూ 1 జీబీ డేటాతో పాటు రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. చిన్నపాటి రీఛార్జ్‌లకే వందల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితుల్లో, రూపాయికే 24 రోజుల సర్వీసులను బీఎస్ఎన్ఎల్ అందించడం ద్వారా జియో, ఎయిర్‌టెల్ గుత్తాధిపత్యానికి గట్టి సవాల్ విసిరినట్లు అయ్యింది. ప్రైవేట్ కంపెనీల అధిక టారిఫ్‌లతో విసుగెత్తి వేరే నెట్‌వర్క్‌కు పోర్ట్ (MNP) అవ్వాలనుకునే వారికి, అలాగే కొత్తగా సిమ్ కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పాత కస్టమర్లకు ఇది వర్తించదు. ఈ ప్రత్యేక పండగ ఆఫర్ అక్టోబర్ 12 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ప్రైవేట్ కంపెనీలకు గుడ్‌బై చెప్పి ఈ ప్రయోజనాలను పొందాలనుకునే వారు అక్టోబర్ 12 లోగా దగ్గరలోని బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ సర్వీస్ పాయింట్ లేదా గుర్తింపు పొందిన రిటైలర్ వద్దకు వెళ్లి, ఆధార్ కార్డుతో కేవైసీ (KYC) పూర్తి చేసి కొత్త సిమ్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.