Reading Time: < 1 minute
కేతన్ హత్య కేసులో సంచలన విషయాలు.. చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు!

ప్రేమించి, నిశ్చితార్థం చేసుకున్న యువకుడినే అత్యంత దారుణంగా హత్య చేసిన సంచలన ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పుణేలోని లోహగడ్ కోట వద్ద జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో పోలీసులు ఇటీవల కోర్టులో దాఖలు చేసిన 5,053 పేజీల చార్జిషీట్.. టెక్నాలజీని నేరానికి ఎలా వాడుకున్నారో కళ్లకు కట్టింది. ఈ హత్య కేసులో కేతన్‌కు కాబోయే భార్య సియా గోయల్, ఆమె స్నేహితులు చేతన్ చౌదరి, రితేష్ హంగేలను నిందితులుగా చేర్చారు. చార్జిషీట్ ప్రకారం, సియా గోయల్ ఈ హత్యకు నెల రోజుల ముందే పక్కా ప్లాన్ వేసింది. మే 31న కేతన్‌ను లోహగడ్ కోటకు తీసుకెళ్లి, అతడిని తోసేయాలనుకున్న ప్రదేశంలోనే వెనుక నుంచి వివిధ యాంగిల్స్‌లో ఫోటోలు తీసి రెక్కీ నిర్వహించింది. అనంతరం జూన్ 18న ఓ ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా కేతన్‌ను నమ్మించి మళ్లీ కోటకు రప్పించారు. అక్కడ సియా కేతన్‌ను నెట్టగా, ఆమె స్నేహితుడు చేతన్ చౌదరి బలంగా తన్ని కొండపై నుంచి లోయలోకి తోసి కిరాతకంగా చంపేశారు. ఈ కేసులో డిజిటల్ ఆధారాలు అత్యంత కీలకంగా మారాయి. హత్యకు ముందు కేతన్ తల్లికి క్షమాపణ సందేశం రాయడానికి ఏఐ సాధనమైన చాట్‌జీపీటీని వాడిన సియా.. హత్య చేశాక దుఃఖాన్ని ఎలా నటించాలి? పోలీసులు పట్టుకుంటే ఎలా తప్పించుకోవాలి? అని చాట్‌జీపీటీలో సెర్చ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మొదట ఇది ప్రమాదంగా భావించినప్పటికీ, పోలీసుల లోతైన విచారణతో ఈ ఘోరం బయటపడింది. ప్రస్తుతం నిందితులు కస్టడీలో ఉన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

BSNL: బీఎస్‌ఎన్‌‌ఎల్ బంపర్ ఆఫర్.. రూ.1కే 24 రోజులు ఉచిత కాల్స్

జింక కోసం మాటువేసిన పులి.. నెమ‌లి ఎంట్రీతో బెడిసికొట్టిన పులి ప్లాన్‌