
ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన సందర్భంగా జరిగిన బహిరంగ సభపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ చేసిన ట్వీట్ తీవ్ర దుమారానికి దారితీసింది. ఒక వీడియోను రీట్వీట్ చేస్తూ.. ‘‘ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉందో కేంద్ర ఆర్థిక మంత్రి స్వయంగా చూశారు. ప్రజలను నిశబ్దంగా ఉంచేందుకు సీఎం స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది’’ అంటూ జైరాం రమేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అది ప్రజల ఆగ్రహం కాదు.. ఉత్సాహం: సీఎం చంద్రబాబు
జైరాం రమేశ్ చేసిన ట్వీట్ వాస్తవాలకు పూర్తి విరుద్ధమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సభకు హాజరైన ప్రజల్లో కనిపించింది ఆగ్రహం కాదని, కూటమి ప్రభుత్వం పట్ల వారిలో వెల్లువెత్తిన అపారమైన ఉత్సాహం, అనూహ్య స్పందన అని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన విపరీతమైన ఉత్సాహాన్ని నియంత్రించి, సభను సజావుగా నడిపించేందుకే తాను కొద్దిసేపు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ప్రజల ఉత్సాహాన్ని కోపంగా చిత్రీకరించడాన్ని బట్టి చూస్తే.. కాంగ్రెస్ నాయకులు ప్రజల ఆలోచనలకు ఎంత దూరంగా ఉన్నారో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం సోషల్ మీడియాలో అసత్య కథనాలు అల్లినంత మాత్రాన ప్రజల అసలైన భావాలను మార్చలేరని తేల్చిచెప్పారు.
Jairam ji, your interpretation of what happened could not be further from reality. What you are trying to falsely portray as public anger was, in fact, an overwhelming and enthusiastic response from the people.
The sheer enthusiasm of the gathering required me to intervene briefly so that the programme could continue smoothly.
To mistake people’s enthusiasm for anger only reveals how disconnected you are from the mood of the people of Andhra Pradesh and Bharat alike.
Politically motivated social media narratives cannot change what people themselves felt and expressed!
@Jairam_Ramesh— N Chandrababu Naidu (@ncbn) October 4, 2026
ఫేక్ న్యూస్‌ను వెంటనే డిలీట్ చేయాలి: మంత్రి లోకేశ్ వార్నింగ్
సీనియర్ నేతగా ఉండి వాస్తవాలు నిర్ధారించుకోకుండా ఫేక్ వీడియోలను ప్రచారం చేయడం జైరాం రమేశ్ స్థాయికి తగదని మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. నిర్మలా సీతారామన్ ప్రసంగాన్ని ఉద్యోగాలు కావాలంటూ స్థానిక యువత అడ్డుకున్నారంటూ ప్రచారం చేయడం పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు. ప్రజలతో ఆర్థిక మంత్రి సాధారణంగా మమేకమైన దృశ్యాలను కుట్రపూరితంగా కట్ చేసి, వక్రీకరించి వీడియోలను వైరల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నాయకుడు ట్వీట్ చేసేముందు వాస్తవాలను నిర్ధారించుకోవాల్సిన కనీస బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఇలాంటి ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాలను సహించేది లేదని స్పష్టం చేస్తూ, ఆ అబద్ధపు ట్వీట్‌ను జైరాం రమేశ్ తక్షణమే తొలగించాలని లోకేశ్ గట్టిగా డిమాండ్ చేశారు.
This is how fake news is manufactured – and then amplified by senior Congress leaders without even bothering to verify the facts.
There was no disruption of the Finance Minister’s speech by local youth demanding jobs. The claim being circulated is completely false. A normal interaction with an enthusiastic gathering is being deliberately clipped, twisted and given a fabricated narrative.
Shri @Jairam_Ramesh, surely a senior leader of your experience should verify facts before tweeting.
Deliberate misinformation is not on. Delete the lie.
@nsitharaman @ncbn
— Lokesh Nara (@naralokesh) October 4, 2026