Reading Time: < 1 minute

Bigg Boss Telugu 10: ఐదో వారం నామినేషన్లలో ఆ ఏడుగురు.. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో డబుల్ ఎలిమినేషన్ గ్యారంటీ?

Caption of Image.

‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ‘ హైస్ లో ఐదో వారం కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధంతో మొదలైంది. నామినేషన్ల ప్రక్రియ గొడవలతో హీటెక్కింది. నాలుగో వారం సృష్టి  ఎలిమినేట్ కావడంతో హౌస్ లో ఒక్కసారిగా సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. సొమవారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో చూస్తే హౌస్ లో రణరంగాన్ని తలిపిస్తోంది. 

ముఖ్యంగా కామనర్ అపూర్వ తన వాదనలతో హౌస్ లో మరింత హీటెక్కించేంది. ఈసారి బిగ్ బాస్ నామినేష్ల కోసం ‘రోడ్ టు రీలోడ్’ అనే ఆసక్తికరమైన టాస్క్  కంటెస్టెంట్ల మధ్యకు తీసుకువచ్చారు.  ఈ టాస్కులో ఓ కంటెస్టెంట్ ఒక పండును బాక్సులో దాచాలి. నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు హౌస్ మేట్స్ ఆపండును వెతికి పట్టుకోవాలి.  వారిలో ఎవరైతే ముందుగా ఆ పండును కనుగొంటారో.. వారికి నామినేషన్ చేసే అవకాశం దక్కుతుంది. ఈ టాస్క్ లో వారి మధ్య పోటీతో పాటు గట్టిగానే గొడవలు కూడా జరిగాయి.

అమన్ ను రాంప్రసాద్.. నామినేట్ చేయగా.. అపూర్వను ముకేశ్ టార్గెట్ చేశాడు. మరోవైపు త్రిగుణ్ కూడా.. అపూర్వనే నామినేట్ చేయడంతో ఆమె ఒక్కసారిగా రగలిపోయింది.  ముకేశ్, వర్షిణిలతో అపూర్వకు జరిగిన వాగ్వాదాలు కూడా ఈ ఎపిసోడ్ లో మరింత హీట్ పెంచేసింది.  ఈ ఐదో వారానికి త్రిగుణ్, అమన్, రోహిత్, శాలిని, అపూర్వ, రాంప్రసాద్, చరణ్ నామినేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ లిస్ట్ లో చివరికి ఎవరెవరు ఉంటారో ఛూడాలి.

మరోవైపు ఈ వీకెండ్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు భారీగానే ఉండే అవకాశముందని టాక్ మరింత ఆసక్తిని పెంచుతోంది. కొత్త కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగుపెడితే గేమ్ డైనమిక్స్ పూర్తిగా మార్చే ఛాన్స్ ఉంది.  పైగా ఈ సారి డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది. దీంతో  ఐదోవారం ఎవరి గేమ్ తల్లకిందులవుతుందో, హౌస్ నుంచి బయటకు వెళ్లేది ఎవరు అన్నదానిపై ఉత్కంఠ మొదలైంది.
 

 

©️ VIL Media Pvt Ltd.