Reading Time: < 1 minute
Jailer 2 Censor Done Rajinikanth Film Gets U A Certificate 2h 45m Runtime

సూపర్‌స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రాబోతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘జైలర్ 2’. సన్ పిచ్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. జైలర్ వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు భారీ వసూళ్లు రాబట్టి రజనీ మాస్ పవర్ ఏంటో చూపించింది. ఇప్పుడు సీక్వెల్ గా వస్తున్న జైలర్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ పై కాస్త మిశ్రమ స్పందన ఉన్నప్పటికీ నెల్సన్ మ్యాజిక్ రజినీ స్టార్ పవర్ కలిసి మ్యాజిక్ జరుగుతుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.

ఈనెల 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికేట్‌ను కేటాయించింది. అలాగే సినిమా రన్‌టైమ్ 2 గంటల 45 నిమిషాలుగా లాక్ అయింది. రజనీకాంత్ మాస్ మేనియా, నెల్సన్ మార్క్ డార్క్ హ్యూమర్, అనిరుధ్ బ్లాక్‌బస్టర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కలగలిపిన పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ‘కూలీ’ సినిమా ‘A’ సర్టిఫికేట్ సాధించడం వల్ల కలెక్షన్ల పరంగా కొంత మేర నష్టపోయినప్పటికీ, ‘జైలర్ 2’ చిత్రం కుటుంబ ప్రేక్షకులందరూ చూసేలా ‘U/A’ తో రావడంతో బాక్సాఫీస్ దగ్గర పెద్ద ‘సంభవం’  సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ఈ శనివారం రోజున విడుదల కానున్న రజనీకాంత్ ప్రత్యేక ఇంటర్వ్యూతో సినిమాపై ఉన్న హైప్ మరింత పీక్స్‌కు చేరనుంది. ఈ ఇంటర్వ్యూలో థలైవర్ తనదైన శైలిలో అందించే లైఫ్ లెసన్స్, సరదా ముచ్చట్లు అభిమానులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.