
రాత్రివేళ చీకటి అలముకోగానే ఆ గ్రామంలో భయాందోళన మొదలవుతోంది. ఉన్నట్టుండి ఇళ్ల కప్పులపై పెద్ద శబ్దంతో రాళ్ల వర్షం కురుస్తోంది. ఎక్కడి నుంచి రాళ్లు వస్తున్నాయో, ఎవరు విసురుతున్నారో తెలియక గ్రామస్తులు ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని గడుపుతున్నారు. అనంతపురం జిల్లా పామిడి మండలం అప్పాజీపేట గ్రామంలో విచిత్ర వాతావరణం నెలకొంది. కొద్దిరోజులుగా అప్పాజీపేటలో అర్ధరాత్రి వేళ ఇళ్లపై విచక్షణారహితంగా రాళ్లు పడుతుండటంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక జనం తలలు పట్టుకుంటున్నారు. అంతేకాదు, గ్రామంలోని ఇళ్ల గోడలపై ‘రేపురా..’అని రాసిఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. గ్రామంలోని ప్రజలంతా కలిసి రాత్రంతా మేల్కొని కాపలా కాసినప్పటికీ ఈ రాళ్ల దాడి మాత్రం ఆగడం లేదు. దీంతో గ్రామంలో ఏవైనా అదృశ్య శక్తులు తిరుగుతున్నాయా? లేదా దయ్యాల పనా? అంటూ రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భయాందోళనకు గురైన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రాత్రివేళ స్వయంగా పోలీసులే గ్రామంలో మోహరించి పహారా కాసినప్పటికీ.. వారి కళ్లెదుటే మళ్లీ ఇళ్లపై రాళ్లు పడటం గమనార్హం. ఈ రాళ్ల దాడి ధాటికి పలు ఇళ్ల పెంకులు, రేకులు ధ్వంసమయ్యాయి. ఆకతాయిల పనే అయితే పోలీసులు ఉన్నారన్న భయంతో పారిపోవాలి కానీ, పోలీసుల ముందే ఇలా రాళ్లు పడుతుండటంతో గ్రామస్తుల్లో భయం రెట్టింపయింది. అయితే అదృశ్య శక్తులు అనే ప్రచారాన్ని కొట్టిపడేస్తున్న పోలీసులు, ఇది చీకటిని ఆసరాగా చేసుకుని ఆకతాయిలు లేదా పుకార్లు రేపేందుకు కొందరు చేస్తున్న కుట్రగానే అనుమానిస్తున్నారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు వేగవంతం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం.. ఇదే అసలైన సంస్కారం అంటూ..
కేతన్ హత్య కేసులో సంచలన విషయాలు.. చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు!
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్.. రూ.1కే 24 రోజులు ఉచిత కాల్స్
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో బెడిసికొట్టిన పులి ప్లాన్