
ఈరోజుల్లో ఏ ఆఫీసులో చూసినా ఎయిర్ కండీషర్లే.దాంతో ఉద్యోగులంతా గంటల తరబడి ఏసీలోనే పని చేస్తుంటారు. అందువల్ల వాళ్ల చర్మం, జుట్టు, పెదాలు తరుచూ పొ డి బారుతుంటాయి. ఇలాంటి సమస్యలను తగ్గించడానికి కొన్ని చిట్కాలు ఉంటాయి.
- ఏసీ వల్ల వచ్చే చల్లటి గాలిలో తేమ ఎక్కువ గా ఉండదు. కాబట్టి చర్మానికి కావాల్సిన తేమ అందాలంటే వీలైనంత వరకు ఎక్కువ నీళ్లను తాగడం చాలా ముఖ్యం. దాంతోపాటు రెండు గంటలకొకసారైనాఐదు నిమిషాల పాటు కారిడార్లో అటూఇటూ నడవడం అలవాటు చేసుకోవా లి.
- క్లెన్సర్స్, ఫేస్ వాష్ వాడుతున్నట్లైతే, వాటిలో నురుగు రాకుండా ఉండే ప్రొడక్ట్ నే ఎంచుకోవాలి.
- రెండుగంటలకోసా రిచల్లని నీళ్లతో ముఖాన్ని తుడుచుకోవాలి.
- చర్మం ఎక్కువగా పొడిబారుతుంటే స్వయంగా తేమను అందించే ఏర్పాటు చేసు కోవాలి. దానికోసం చిన్నపాటి హ్యుమిడిఫయర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి ధర తక్కువగానే ఉంటుంది.
- ఆఫీసు డెస్కు మీద గాజు పాత్ర ఉంచి అందులో నీళ్లు పోసి కొన్ని పూల రెక్కల్ని వేయాలి. అది డెకరేటివ్ చూడటానికి ఆకర్షణీయంగా ఉంటూనే… తేమని అందిస్తుంది.