Reading Time: < 1 minute
Director Skips Medium Budget Movie Success Meet Tollywood Rumors

Tollywood: టాలీవుడ్‌లో జరిగే కొన్ని పరిణామాలు ఒక్కోసారి ఆసక్తిని కలిగిస్తే, ఒక్కోసారి మాత్రం అయ్యో పాపం అనిపించే సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా అలాంటి ఓ సంఘటన చోటుచేసుకుంది. ఈ మధ్య రిలీజ్ అయిన ఓ మీడియం బడ్జెట్ సినిమాకి సక్సెస్ మీట్ నిర్వహించారు. సహ నటీనటులందరూ ఈవెంట్‌లో పాల్గొన్నారు..

సాధారణంగా రిలీజ్ కి ముందు ఏదైనా ఈవెంట్‌లో దర్శకుడు కనిపించకపోతే, ఆ దర్శకుడు కంటెంట్ డెలివరీలో బిజీగా ఉన్నాడని చెబుతూ వస్తారు మేకర్స్. కానీ, ఈసారి మాత్రం సదరు దర్శకుడు సక్సెస్ మీట్‌లో కనిపించకపోవడం కాస్త ఆసక్తికరమైన విషయమే. దానికి తోడు ఆ దర్శకుడికి అది మొదటి సినిమా. మొదటి సినిమా సక్సెస్ మీట్ నిర్వహిస్తుంటే ఏ దర్శకుడైనా హాజరు కాకుండా ఉంటాడా అనే అనుమానాలు సాధారణంగానే మీడియా ప్రతినిధులకు తలెత్తాయి.

ఈ విషయం మీద సదరు టీమ్‌ని ఆఫ్ ది రికార్డ్ సంప్రదించగా, వారు అంతే ఆఫ్ ది రికార్డుగా ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. అదేమిటంటే.. దర్శకుడికి, ప్రొడ్యూసర్‌కి మధ్య కాస్త గ్యాప్ ఉందని, సదరు దర్శకుడు షూటింగ్ సమయంలో చాలా మితిమీరి ప్రవర్తించాడని ఆ నిర్మాత భావించాడట. దీంతో సినిమా రిలీజ్ తర్వాత జరిగిన సక్సెస్ మీట్‌కి కూడా ఆయన్ని దూరం పెట్టారనే విషయం చెప్పుకొచ్చారు. అయితే ఆ సినిమా ఏమిటి, ఆ దర్శకుడు ఎవరు అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.