
- గుర్తించాలని.. ప్రొఫెసర్ కంచ ఐలయ్య తీర్మానం
- దళిత, వెనకబడిన ఆదివాసీలకు ఇంగ్లీష్ విద్య అందాలని సూచన
- పాక్పీట్లో ఐలయ్య విగ్రహం ఆవిష్కరణ
రామచంద్రాపురం, వెలుగు: మహిళలు, అణగారిన వర్గాలకు విద్యను అందించేందుకు ఉద్యమం సాగించిన సావిత్రిబాయి ఫూలేను మదర్ఆఫ్ఇండియన్ ఇంగ్లిష్‌గా గుర్తించాలని ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్ పిలుపునిచ్చారు. ఆదివారం 209వ ఇండియన్ ఇంగ్లిష్ డే, కంచ ఐలయ్య 74వ జన్మదినం సందర్భంగా తెల్లాపూర్‌లోని ఆస్క్ఎడ్యుకేషనల్ సొసైటీలోని పాక్పీట్ (ఫూలే అంబేద్కర్ సెంటర్ ఫర్ ఫిలాసఫి అండ్ ఇంగ్లీష్ ట్రైనింగ్) సెంటర్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సావిత్రిబాయి ఫూలేను మదర్ఆఫ్ఇండియన్ ఇంగ్లిష్‌గా తీర్మానిస్తూ రూపొందించిన చిత్రపటాన్ని ప్రముఖులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం పాక్పీట్ విద్యార్థులు తమ అభిమానాన్ని చాటుతూ ప్రొఫెసర్కంచ ఐలయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆస్క్ ఫౌండర్, మట్టి మేధావి కొల్లూరి సత్తయ్య, డైరెక్టర్ కొల్లూరి భరత్, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ఐలయ్య రచించిన రెండు పుస్తకాలను ఆవిష్కరించారు.
అనంతరం కంచ ఐలయ్య మాట్లాడుతూ టెక్నాలజీ, సైన్స్, ఏఐలాంటి రంగాల్లో దూసుకుపోతున్న ఈ పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే ఇంగ్లిష్ లాంగ్వేజ్కీలక సాధనమని పేర్కొన్నారు. ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్ల విద్య అవసరమని ముఖ్యంగా గ్రామీణ, పేద, దళిత, ఆదివాసీ, వెనకబడిన వర్గాలకు ఇంగ్లిష్‌ను దరి చేయాలని ఆయన ప్రభుత్వాలను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు వెంకటేశ్వర్లు, బాంగ్యా భూక్యా, తిరుపతి, సృజన యాదవ్, పాక్పీట్ ప్రొఫెసర్మణి, ఆస్క్ సొసైటీ సభ్యులు, ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.