Reading Time: < 1 minute
Ap Cabinet Meeting Today Chandrababu To Discuss Local Body Elections Bc Reservations

AP Cabinet Meeting: ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు ఏపీ సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలోని పలు సంస్థలకు భూ కేటాయింపుల అంశంపై కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, తాజా పరిపాలనా అంశాలపై కూడా మంత్రివర్గం చర్చించనుంది.

ఇక, కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియ, ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ అంశంపై ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించే విషయాన్ని పరిశీలిస్తున్న నేపథ్యంలో కేబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు.. కూటమి పార్టీల మధ్య కూడా సీట్ల సర్దుబాటుపై చర్చలు సాగుతోన్న విషయం విదితమే.