Reading Time: < 1 minute
Poland Ostroleka School Knife Attack Seven Injured

పోలాండ్‌లోని ఓస్ట్రోలేకా పాఠశాలలో దారుణం జరిగింది. 19 ఏళ్ల విద్యార్థి కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో ఏడుగురికి గాయాలయ్యాయి. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బీచ్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు.

ఇక నిందితుడి దాడిలో గాయపడ్డ విద్యార్థులను ఓస్ట్రోలేకలోని మజోవియన్ స్పెషలిస్ట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితిని బట్టి మరో చోటుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని.. గాయపడ్డవారికి చికిత్స అందిస్తున్నట్లు ఓస్ట్రోలేక మేయర్ పావెల్ నీవియాడోమ్స్కీ ఒక ప్రకటనలో తెలిపారు.