Reading Time: < 1 minute

ఎయిర్ పోర్ట్ ప్యాసింజర్లకు గుడ్ న్యూస్!..పుష్పక్‌‌ బస్సు ఛార్జీల తగ్గింపు

Caption of Image.

హైదరాబాద్ సిటీ, వెలుగు : శంషాబాద్‌‌ ఎయిర్ పోర్డుకి రాకపోకలు సాగించే టీజీఎస్‌‌ఆర్టీసీ పుష్పక్‌‌ ఏసీ బస్సుల ఛార్జీలను ఆర్డీసీ 40 శాతం వరకు తగ్గించింది. ఈ ఛార్జీలు బుధవారం నుంచే అమల్లోకి రానున్నాయి. మియాపూర్‌‌ ఎక్స్‌‌రోడ్‌‌ నుంచి ఎయిర్​పోర్ట్​కు గతంలో రూ.350గా ఉండగా, ఇప్పుడు రూ.250 చేసింది. అలాగే, జేఎన్‌‌టీయూ నుంచి రూ.350 ఉంటే రూ.200, శిల్పారామం నుంచి రూ.300 ఉంటే రూ.200, గచ్చిబౌలి నుంచి రూ.300 ఉంటే రూ.150కి తగ్గించారు. లింగంపల్లి నుంచి ఎయిర్​పోర్ట్​కు ఇదివరకు రూ.300 ఉండగా రూ.200కు, ఆల్విన్‌‌ ఎక్స్‌‌రోడ్‌‌ నుంచి రూ.350 ఉంటే రూ.200కు, కొండాపూర్‌‌ నుంచి రూ.300 ఉంటే రూ.200కు, కొత్తగూడ నుంచి రూ.300 ఉంటే రూ.150కి తగ్గించారు. గచ్చిబౌలి నుంచి రూ.300 ఉండగా, రూ.150 చేశారు. 

జేబీఎస్​నుంచి ఎయిర్​పోర్ట్​కు..

జేబీఎస్‌‌ నుంచి ఎయిర్​పోర్ట్​కు రూ.350 ఉంటే రూ.200 చేశారు. విమానాశ్రయం నుంచి జేబీఎస్‌‌కు రూ.400 ఉంటే రూ.300కు తగ్గించారు. మందమల్లమ్మ నుంచి జేబీఎస్‌‌, జేబీఎస్‌‌ నుంచి మెహిదీపట్నం, జేబీఎస్‌‌ నుంచి ఆరాంఘర్​వరకు చార్జీని .100గా నిర్ణయించారు. 

©️ VIL Media Pvt Ltd.