Reading Time: 2 minutes
ఆమె కళ్లలోనే ఎదో మాయ ఉంది..! ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.? ఒకప్పుడు టాప్ బ్యూటీ.. ఇప్పుడు ఇలా!

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపించే కొన్ని ఫొటోలు నెటిజన్లను ఒక్కసారిగా గత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంటాయి. తాజాగా అలాంటి ఓ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో కనిపిస్తున్న కళ్లు ఎవరివో గుర్తుపట్టారా.? అందంలో అప్సరస ఆమె.. ఈ ముద్దుగుమ్మను చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..  కనిపిస్తున్న హీరోయిన్‌ను చూసి.. ఈమె ఎవరో గుర్తుపట్టారా.? అంటూ నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఒకప్పుడు హీరోయిన్ గా దూసుకుపోయిన ఈ అమ్మడు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. ఆమె మరెవరో కాదు.. అందాల నటి సదా. తెలుగు ప్రేక్షకులకు సదా పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2002లో విడుదలైన జయం సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన సదా.. తొలి సినిమాతోనే భారీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్ర, నటన, అమాయకమైన లుక్ అప్పట్లో యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

జయం తర్వాత సదాకు వరుసగా అవకాశాలు రావడంతో టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిపోయారు. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. సదా తన కెరీర్‌లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారు. ముఖ్యంగా అపరిచితుడు సినిమాలో విక్రమ్ సరసన నటించి మరోసారి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా ఆమె కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా.. కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనూ నటిస్తూ తన నటనా ప్రతిభను చాటుకున్నారు. తెలుగు, తమిళ సినిమాలతో పాటు ఇతర భాషల్లోనూ ఆమెకు మంచి గుర్తింపు లభించింది.

ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సదా.. ప్రస్తుతం సినిమాల్లో చాలా తక్కువగా కనిపిస్తున్నారు. అయితే సోషల్ మీడియా ద్వారా అభిమానులకు మాత్రం టచ్‌లో ఉంటున్నారు. అప్పుడప్పుడు తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా కనిపిస్తున్న ఈ ఫొటోలో సదా సంప్రదాయ చీరలో, బొట్టు, నుదుటి అలంకరణతో ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ఆమెను ఇలా చూసిన అభిమానులు “సదాలో అసలు మార్పే లేదు”, “జయం హీరోయిన్‌ను మళ్లీ గుర్తు చేశారు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Sadaa Sayed (@sadaa17)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.