Reading Time: < 1 minute

ఇండియన్ ఆర్మీ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది: 27 ఏళ్లలోపు యువతకు గోల్డెన్ ఛాన్స్.. మిస్సవకండి

Caption of Image.

ఇండియన్ మిలటరీ అకాడమీలో (ఐఎంఏ)2027, జులైలో ప్రారంభం కానున్న 145వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ (టీజీసీ145) ద్వారా ఇండియన్ ఆర్మీలో పర్మినెంట్ కమిషన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 

మొత్తం ఖాళీలు: 30.

విభాగాల వారీగా ఖాళీలు: సివిల్ 8, కంప్యూటర్ సైన్స్ 6, ఎలక్ట్రికల్ 2, ఎలక్ట్రానిక్స్ 6, మెకానికల్ 6, ఇతర ఇంజినీరింగ్ విభాగాలు 2. 

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజినీరింగ్ స్ట్రీమ్​లో బీఈ/ బి.టెక్ లేదా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ పూర్తిచేసి ఉండాలి. 

వయసు: 2027, జులై 1 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి. అంటే 2000, జులై 1 నుంచి 2007, జూన్​ 30 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. 

లాస్ట్ డేట్: అక్టోబర్ 29. 

సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్, ఎస్ఎస్​బీ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.joinindianarmy.nic.inను సందర్శించండి.

►ALSO READ | నర్స్, ఏఎన్‌ఎం, మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు: ఎగ్జామ్ లేకుండానే రిక్రూట్‌‌మెంట్.. వీరికి మంచి ఛాన్స్!

©️ VIL Media Pvt Ltd.