Reading Time: < 1 minute

వరుస ఆఫర్లు కొల్లగొట్టేస్తున్న మమిత బైజు.. రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో ఛాన్స్!

Caption of Image.

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మమిత బైజు పేరు మార్మోగిపోతుంది.  వరుస ఆఫర్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోందీ బ్యూటీ.  మలయాళ చిత్రాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ..  తన సహజమైన నటన, అమాయకత్వంతో కూడిన అందంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ప్రేమలు చిత్రంతో గుర్తింపును సొంతం చేసుకున్న ఈ భామ.. 2026లో వరుస ఆపర్లతో టాప్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది.

ఈ మలయాళి ముద్దుగుమ్మ నటించిన చిత్రాలు రూ. 100 కోట్ల నుంచి రూ. 300 కోట్ల వరకు వసూళ్లు సాధిస్తుండటంతో, స్టార్ హీరోలు, అగ్ర నిర్మాణ సంస్థలకు ఇప్పుడు మమితానే ఫస్ట్ ఛాయిస్‌గా మారింది.  లేటెస్ట్ గా మమిత బైజు మరో బిగ్ ప్రాజెక్టులో భాగమైనట్లు సమాచారం.  ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగంగా.. రిషబ్ శెట్టి కథానాయకుడిగా రూపొందుతున్న భారీ పౌరాణిక చిత్రం ‘జై హనుమాన్’లో ఆమె కీలక పాత్రకు ఎంపికైంది. 

ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపించనుండగా, రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే మమితకు ఈ ప్రాజెక్ట్ మరో బిగ్ బ్రేక్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది.  ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.  ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నట్లు సమాచారం.

►ALSO READ | Mandaadi: సూరి, సుహాస్ మూవీకి అదిరిపోయే రికార్డ్.. రూ.150 కోట్ల మార్క్ దాటిన ‘మండాడి’

ఇదిలా ఉంటే.. మమిత నటించిన ‘ఇరండు వానం’ అక్టోబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. విష్ణు విశాల్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ‘రాక్షసన్’,’ముండాసుపట్టి’ ఫేమ్ రామ్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీతో మమిత తమిళ ప్రేక్షకుల్లోనూ మరింతగా పాపులర్ అయ్యే అవకాశం ఉంది.  ఇప్పుడు’జై హనుమాన్’ వంటి పాన్-ఇండియా స్థాయి ప్రాజెక్ట్‌లోకి అడుగుపెడితే ఆమె కెరీర్ గ్రాఫ్ మరింత ఎత్తుకు వెళ్లడం ఖాయమనే చెప్పాలి.
 

©️ VIL Media Pvt Ltd.