Reading Time: < 1 minute
Gv Prakash For An Ideal Family What Is The Actual Story

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ కోసం వెంకీ ఫ్యాన్స్‌ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రాన్ని ఈ నెల 9న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. దీనికి తగ్గట్లే ప్రమోషన్లు కూడా ప్లాన్ చేశారు. కానీ వర్క్స్ ఇంకా పెండింగ్ ఉండడంతో రిలీజ్ వాయిదా వేశారు.

అయితే ఈ సినిమా  సినిమా రీ-రికార్డింగ్ వర్క్‌పై సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాధ్యతలను సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ చేపడుతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రూమర్లకు చెక్ పెడుతూ నిర్మాతలు అధికారికంగా స్పందించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయని చెబుతూ చిత్ర యూనిట్ ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ‘జెట్ స్పీడ్’లో ఆర్ఆర్ (RR) వర్క్‌ను పూర్తి చేస్తున్నారని ఆ పోస్టర్ ద్వారా మేకర్స్ స్పష్టం చేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌కి తమన్‌ మాత్రమే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారని తేలిపోవడంతో రూమర్లకు తెరపడినట్లయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండటంతో, తమన్ అందించే రీ-రికార్డింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.