Reading Time: < 1 minute

మ్యూల్ అకౌంట్లే టార్గెట్‌‌..ఢిల్లీ, ముంబై సహా ఆరు రాష్ట్రాల్లో  సీఎస్‌‌బీ భారీ ఆపరేషన్‌‌

Caption of Image.

హైదరాబాద్‌‌, వెలుగు: సైబర్‌‌ నేరగాళ్ల మ్యూల్‌‌ అకౌంట్లే టార్గెట్‌‌గా తెలంగాణ సైబర్‌‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్‌‌బీ) భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఢిల్లీ, ముంబై సహా దక్షిణాది రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్‌‌, కర్ణాటక, తమిళనాడు, కేరళలో ఏకకాలంలో సోదాలు చేపట్టింది.

రెండు వారాలుగా కొనసాగుతున్న స్పెషల్ ఆపరేషన్‌‌లో దాదాపు 100 మందికి పైగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ముఠాలు, పెద్ద సంఖ్యలో డెబిట్‌‌ కార్డులు, బ్యాంకు పాస్‌‌బుక్‌‌లు,  స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆయా రాష్ట్రాల్లోని కోర్టుల్లో హాజరుపరిచి ట్రాన్సిట్‌‌ వారెంట్‌‌పై హైదరాబాద్‌‌ తరలిస్తున్నారు.  

©️ VIL Media Pvt Ltd.