Reading Time: < 1 minute
Srinidhi Shetty Kgf Fame Personal Life Shocking Comments

Srinidhi Shetty:పాన్-ఇండియా సెన్సేషన్ ‘కెజియఫ్’ (KGF) సినిమాతో రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న కన్నడ భామ శ్రీనిధి శెట్టి తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇంతటి భారీ స్టార్‌డమ్ వచ్చిన తర్వాత జీవితం ఎలా మారిపోయిందనే అంశంపై ఆమె ఓపెన్‌గా స్పందిస్తూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కెజియఫ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వ్యక్తిగత జీవితం ఎలా మారిందనే ప్రశ్నపై శ్రీనిధి తనదైన శైలిలో నవ్వుతూ స్పందించారు. “ప్రొఫెషనల్ స్పేస్‌లో గుర్తింపు, ప్రేమ, బోలెడన్ని అవకాశాలు వచ్చాయి. కానీ వ్యక్తిగత జీవితంలో నేను పాత అమ్మాయినే. అందులో ఎలాంటి మార్పూ రాలేదు. ఇంట్లో ఇప్పటికీ నన్ను తిడుతూనే ఉంటారు. ‘వెళ్లి కిచెన్ క్లీన్ చెయ్, పని చెయ్’ అంటూ పనులు పురమాయిస్తారు. కెజియఫ్ అయినా సరే, మరే ప్రాజెక్ట్ అయినా సరే.. నా నిజ జీవితంలో నేను ఎప్పటిలాగే సాధారణంగా ఉంటాను” అంటూ సరదాగా చెప్పుకొచ్చారు.

సినిమా ఎంపికలు, కమర్షియల్ హద్దుల గురించి మాట్లాడుతూ బోల్డ్ కామెంట్స్ చేశారు శ్రీనిధి. సినిమా ఆఫర్లు ఎంచుకునేటప్పుడు పలానా జానర్ మాత్రమే చేయాలని ఎలాంటి ప్లాన్స్ వేసుకోనని, అన్ని రకాల ప్రయోగాలు చేయడానికి రెడీ ఉన్నానని అన్నారు. అయితే తనకు సౌకర్యంగా లేని పాత్రలు, పాటలను ఏమాత్రం చేయబోనని స్పష్టం చేశారు. “ఎవరి స్ట్రాటజీ, అప్రోచ్ వారికుంటుంది. కానీ నాకు మనస్ఫూర్తిగా కంఫర్ట్ లేని పని చేయడం నాకు చేతకాదు. నచ్చకపోతే 100 శాతం ఎఫర్ట్ పెట్టలేను, నటిగా తటపటాయిస్తూ నటించడం సరికాదు. అందుకే ప్రాజెక్ట్ కమిట్ అయ్యే ముందే మేకర్స్‌తో ‘నేను ఇవి చేయలేను.. ఇంతవరకే చేయగలను’ అని తేల్చి చెప్పేస్తాను. ఆ తర్వాత నన్ను ప్రాజెక్ట్‌లో ఉంచుకోవాలో వద్దో అనేది పూర్తిగా వారి ఇష్టం” అంటూ తన నిక్కచ్చితనాన్ని బయటపెట్టారు. స్టార్ హీరోయిన్‌గా ఎదిగినా ఎక్కడా తలబిరుసుతనం ప్రదర్శించకుండా ఉన్నదున్నట్లు మాట్లాడిన శ్రీనిధి తీరు సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.