Reading Time: < 1 minute

ఫిజియోథెరపీ సెంటర్ రీ-ఓపెన్‌కు లక్ష లంచం.. ఏసీబీకి అడ్డంగా దొరికిన రంగారెడ్డి DMHO

Caption of Image.

లంచం తీసుకుంటూ రంగారెడ్డి డీఎంహెచ్ వో స్వర్ణకుమారి  ఏసీబీకి అడ్డంగా దొరికారు.  శివరాంపల్లిలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.  ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించిన వ్యవహారంలో లక్ష లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు డీఎంహెచ్ వోను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటనలో ఆమెతో పాటు శ్రీనివాస్ అనే అధికారిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

 ఎల్బీనగర్‌లో ఫిజియోథెరపీ సెంటర్‌ను తిరిగి తెరవడానికి అనుమతి ఇవ్వాలంటే స్వర్ణకుమారి రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా బాధితుడి నుంచి రూ.లక్ష తీసుకున్నట్లు సమాచారం. ఎల్బీనగర్ వద్ద ఈ మొత్తాన్ని స్వీకరించినట్లు తెలుస్తోంది.

బాధితుడి నుంచి డబ్బులు తీసుకున్న అనంతరం ఆ విషయాన్ని డీఎంహెచ్‌ఓకు ఫోన్ ద్వారా సహాయకుడు శ్రీనివాస్ తెలిపినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారితో పాటు శ్రీనివాస్, ఓ ప్రైవేట్ డ్రైవర్‌ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఉన్న సమయంలో ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను శివరాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. 

©️ VIL Media Pvt Ltd.