
దిన ఫలాలు (అక్టోబర్ 6, 2026): మేష రాశి వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. అనుకోకుండా ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. వృషభ రాశి వారికి ఉద్యోగంలో కొద్దిపాటి పురోగతికి అవకాశముంది. అనుకోకుండా కొన్ని మంచి కంపెనీల నుంచి ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. మిథున రాశి వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాభవం బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వానికి అవకాశం ఉంది. ఆదాయపరంగా, వ్యాపారపరంగా పురోగతి ఉంటుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. అనుకోకుండా ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు అందు తాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. కొన్ని దైవ కార్యాల్లో పాల్గొంటారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో కొద్దిపాటి పురోగతికి అవకాశముంది. అనుకోకుండా కొన్ని మంచి కంపెనీల నుంచి ఉద్యోగావకాశాలు అందివస్తాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల్లో అనుకూల సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారాలు కూడా లాభాల బాటలో పురోగమిస్తాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు బాగా సఫలయవుతాయి. అనుకున్న పనులు అను కున్నట్టు పూర్తవుతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
సొంత పనులు మీద, వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం బాగా తగ్గుముఖం పడతాయి. వ్యక్తిగత జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఇతరులకు సహాయం చేయడం, దైవ కార్యాల్లో పాల్గొనడం వంటివి జరుగుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో సొంత ఆలోచనలు పనికి వస్తాయి. ఏ విషయంలోనూ తొందరపాటు ధోరణి పనికి రాదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాల నిస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశముంది. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. బంధువులకు సహాయంగా నిలబడతారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు అమలు చేస్తారు. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా పురోగమిస్తాయి. వ్యాపారాల్లో లాభాలపరంగా విజయాలు సాధిస్తారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుతాయి. ఆధ్యా త్మిక చింతన పెరిగి, కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
నిరుద్యోగులకు ఎదురు చూస్తున్న శుభవార్త అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగు తాయి. అధికారులు, సహచరులకు సహకారం అందిస్తారు. వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. శుభ కార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలను పూర్తి చేయడంలో సహచరుల కంటే కంటే ముందుంటారు. వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండదు. ఉద్యోగపరంగా ఏ ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశిం చిన శుభవార్త అందుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంటా బయటా మాటకు తిరుగుండదు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఆర్థిక పరి స్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. దూరపు బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు అను కోకుండా తగిన ఆఫర్ అందుతుంది. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. తోబుట్టువులతో ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి సానుకూలపడుతుంది. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. కొత్త లక్ష్యాలు చేపట్టడానికి అవకాశం ఉంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా పురోగమిస్తాయి. చిన్ననాటి మిత్రు లతో విందు కార్య క్రమంలో పాల్గొంటారు. ఒక శుభకార్యంలో బంధువులకు ఆర్థికంగా సహాయ పడతారు. ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు పడతారు. పిల్లలు బాగా శ్రమపడాల్సి ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగం మారే ఆలోచన చేస్తారు. కొత్తగా ఇల్లు కొనడం మీద దృష్టి పెడతారు. పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ వల్ల ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.